amp pages | Sakshi

పాక్‌కు షాకిస్తూ అమెరికా సభ్యుల బిల్లు‌!

Published on Wed, 09/21/2016 - 15:33

అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు శక్తిమంతమైన సభ్యులు పాకిస్థాన్‌కు షాకిచ్చేలా ఓ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం(స్టేట్‌ స్పాన్సర్‌ ఆఫ్‌ టెర్రరిజం) గా పాకిస్థాన్‌ని ప్రకటించాలని వారు బిల్లులో కోరారు.

’పాకిస్థాన్‌ పాల్పడిన వెన్నుపోట్లకుగాను..  మనం ఆ దేశానికిచ్చే నిధులను ఆపివేసి.. దానిని ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రిపబ్లికన్‌ పార్టీ కాంగ్రెస్‌ (చట్టసభ) సభ్యుడు, ఉగ్రవాదంపై సబ్‌ కమిటీ చైర్మన్‌ టెడ్‌ పోయి ఈ బిల్లులో పేర్కొన్నారు. ఆయన డెమొక్రిటిక్‌ పార్టీ చట్టసభ సభ్యుడు డెనా రోహ్రాబచర్‌తో కలిసి ’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను గుర్తించే చట్టం’  బిల్లును ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్‌ కమిటీలో కీలక సభ్యుడిగా డెనా రోహ్రాబచర్‌ ఉన్నారు.

’పాకిస్థాన్‌ ఒక విశ్వసించలేని మిత్రదేశమే కాదు.. అది ఎన్నో ఏళ్లుగా మన శత్రువుల్ని రెచ్చగొడుతూ వస్తున్నది. ఒసాన్‌ బిన్‌ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం మొదలు.. హక్కానీ నెట్‌వర్క్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వరకు ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్థాన్‌కు ఎవరికి అండగా నిలిచిందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అది అమెరికాకు ఎప్పుడు అండగా నిలబడలేదు’ అని పోయి వివరించారు. ఒబామా సర్కారు తమ బిల్లుపై అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ మద్దతు ఇచ్చిందా? లేదా? అన్న దానిపై 90 రోజుల్లో అధ్యక్షుడు నివేదిక విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)