amp pages | Sakshi

బరువైన బాల్యం..

Published on Thu, 03/09/2017 - 23:18

సాధారణంగా ఐదేళ్ల వయసు పిల్లలెవరైనా అప్పుడే స్కూల్‌కి వెళ్తూ, అమ్మనాన్నల ఒడిలో ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, బామ్మ, తాతయ్యల ఆలనాపాలనలో సేదతీరుతూ గడిపేస్తారు. ఆ వయసులో పిల్లలకు ఎలాంటి ఒత్తిడీ, బాధ్యతలూ ఉండవు. అయితే అందరిబాల్యం ఒకేలా ఉండదు. కొందరు పిల్లలు చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. చైనాకు చెందిన అన్నా వాంగ్‌ అనే ఓ ఐదేళ్ల బాలిక తన బామ్మ, తాతమ్మలను సంరక్షిస్తోంది. చిన్నతనంలోనే వయసుకు మించిన బాధ్యతల్ని మోస్తూ విస్మయపరుస్తోంది. వయసుకు బరువైన పనులైనా, బాధ్యతగా భావిస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది.

ఎవరూ లేకపోవడంతో..
నైరుతి చైనాలోని జుయిన్‌ అనే మారుమూల పర్వత ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలో చిన్న ఇంటిలో నివసించే బాలిక అన్నా వాంగ్‌. అన్నాకి మూడు నెలల వయసున్నప్పుడు, ఆమె తండ్రి జైలుపాలయ్యాడు. కొంతాలం తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో అన్నా, ఆమె బామ్మ, తాతమ్మ (బామ్మకి అమ్మ) మాత్రమే మిగిలారు. వృద్ధులైన బామ్మ, తాతమ్మల్ని సంరక్షించడానికి ఎవరూ లేరు. దీంతో ఆ బాధ్యతల్ని అన్నా తీసుకుంది. వారిద్దరి సంరక్షణకు పూనుకుంది.

 అన్నీ తానై..
చిన్నప్పటినుంచే బామ్మ, తాతమ్మలకు సేవ చేయడం మొదలుపెట్టింది అన్నా. వృద్ధులైన వారిద్దరూ దాదాపుగా మంచానికే పరిమితం. బామ్మకి ఆర్థరైటిస్‌ సహా పలు అనారోగ్య సమస్యలుండడంతో ఎటూ కదలలేదు. తాతమ్మకు కూడా దాదాపు 92 ఏళ్లు ఉండడంతో ఆమె సైతం సొంతంగా ఏ పనీ చేసుకోలేదు. దీంతో ఇద్దరి సంరక్షణా బాధ్యతల్ని అన్నా తన భుజాలపై వేసుకుని, వారికి అన్ని రకాలుగా సాయపడుతోంది.

వంటసహా బాధ్యతలన్నీ..
ఐదేళ్లలోపు పిల్లలకు వంట చేయడం అసలేరాదు. కానీ అన్నా మాత్రం బామ్మ, తాతమ్మల కోసం రోజూ వంట చేస్తుంది. నిజానికి ఇంట్లో వంట చేసే స్టవ్‌ చాలా ఎత్తులో ఉన్నప్పటికీ, ఓ స్టూల్‌ వేసుకుని వంట చేయడం విశేషం. ఇక పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి రోజూ తాజా కూరగాయలు తీసుకుని వస్తుంది. ఈ విషయంలో చుట్టుపక్కల వారు ఎంతగానో సహకరిస్తారు. అన్నా కష్టం చూడలేని వారు, ఎప్పుడు అవసరమైనా తమ పొలంలోంచి నచ్చిన కూరగాయలు తీసుకెళ్లేందుకు అనుమతించారు.

ప్రతి పనీ సొంతంగానే..
అన్నా ప్రతిరోజూ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి దినచర్య ప్రారంభిస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తీసుకురావడం, వంట చేయడం సహా మొత్తం పనులన్నీ సొంతంగానే చేస్తుంది. అన్నాకు సాయపడేందుకు ఎవరూ లేరు. బామ్మ, తాతమ్మలకు స్నానం చేయించడం, తినిపించడం, కాలకృత్యాలకు తీసుకెళ్లడం వంటి పనులను సైతం అన్నా ఏ విసుగూ లేకుండా చేస్తుంది. పిల్లలు ఈ వయసులో పెద్దవారికి అంత సేవచేయడం చాలా అరుదు. కానీ అంత సేవ చేస్తున్నా, బామ్మ, తాతమ్మలపై అన్నాకి కొంచెం కూడా విసుగురాదు. వారికి సేవచేయడం తనకెంతో ఇష్టమని, వారిద్దరి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానని అన్నా చెప్పింది. అయితే అప్పుడప్పుడూ తన తండ్రి ఫొటో చూస్తూ అన్నా కంటతడి పెట్టుకుంటుంది. తన తండ్రి జైలు నుంచి తిరిగొస్తాడని, ఇబ్బందులు తొలగిపోతాయని ఆశతో ఎదురు చూస్తోంది అన్నా. 
– సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)