amp pages | Sakshi

హెల్త్‌కార్డుల భారంపై ‘కార్పొరేట్’ బేరం

Published on Tue, 09/15/2015 - 02:00

* వైద్య చికిత్సల ప్యాకేజీపై 40 శాతం అదనంగా పెంచాలని డిమాండ్
* మొదట్లో 25 శాతమే కోరిన ఆసుపత్రులు... ఓకే చెప్పిన సర్కారు
* తాజా డిమాండ్లపై ఉన్నతస్థాయి సమావేశానికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డులపై కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకో మాట మారుస్తున్నాయి. కొత్త మెలికలు పెడుతున్నాయి. ప్యాకేజీలపై బేరమాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల హెల్త్‌కార్డులపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇంతకుముందు చేసిన డిమాండ్‌కు సర్కారు ఓకే అని చెప్పింది.

గతంలో ఆరోగ్యకార్డుల శస్త్రచికిత్స ప్యాకేజీని 25 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మొదట్లో ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ససేమిరా అంది. 10 లేదా 15 శాతానికి మించి పెంచబోమని స్పష్టం చేసింది. కానీ చర్చోపచర్చల అనంతరం చివరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్‌కు తలొగ్గింది. తాజాగా 25 శాతం సరిపోదని, 40 శాతం ప్యాకేజీ పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రులు కోరుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యకార్డుల అమలుకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయంపై తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది.
 
ఓపీకి ఉచిత సేవలపై ప్రతిష్టంభన

ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించగా... ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఔట్ పేషెం ట్లుగా వస్తే ఉచితసేవలు అందించడం చాలా కష్టమని, అవసరమున్నా, లేకున్నా ఉద్యోగులు ఆసుపత్రులకు విరివిగా వస్తే తమకు ఇబ్బంది ఏర్పడుతుందని, అందువల్ల అందుకు ఫీజు వసూలు చేస్తామని, దానికి అంగీకరించాలని యాజమాన్యాలు అంటున్నాయి.

ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి అవసరమైతే ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ అడు గు ముందుకు పడలేదు. మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్‌ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యా ల ప్రతినిధులు కోరుతున్నారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎంఆర్‌పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి చెల్లిస్తే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. శస్త్రచికిత్సల ప్యాకేజీ పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 200 కోట్లకు మించి ఖర్చు కాదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం.
 
‘దసరాకి కార్పొరేట్ చికిత్స అందించాలి’
ఉద్యోగులకు దసరా పండగలోపు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీఆర్‌టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిని సోమవారం కలసి కోరారు. ఉపాధ్యాయుల నుంచి ప్రీమియం గెజిటెడ్ స్కేలు వారు రూ. 200, మిగతావారు రూ. 150 చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)