amp pages | Sakshi

జీసీఐ ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన భారత్

Published on Wed, 09/28/2016 - 11:59

2016-17 సంవత్సరానికి గాను  వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన  గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ లో   భారత్ 39 వ ర్యాంకును సాధించింది.   దీంతో ప్రపంచంలో మోస్ట్ కాంపిటీటివ్ 39 వ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.   రెండేళ్లలో మొత్తం 32 ర్యాంకులు ఎగబాకి ఈ ఘనతను సాధించింది. 138 ఆర్ధికవ్యవస్థలను పరిశీలించిన  డబ్ల్యు ఈఎఫ్ జీసీఐ  కాంపిటీటివ్నెస్ తాజా ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.  ఈ జాబితాలో  టాప్ ఆర్థిక వ్యవస్థగా స్విట్జర్లాండ్  అగ్ర భాగాన లిచింది.  సింగపూర్ , అమెరికా  రెండు,  మూడవ స్థానాలు  సాధించాయి. జర్మనీ తరువాత, నెదర్లాండ్స్ (5), స్వీడన్ (6) బ్రిటన్ (7), జపాన్ (8), హాంకాంగ్ (9), ఫిన్లాండ్ (10) నిలిచాయి.  

ఆయా దేశాల  12 కేటగిరీల స్థాయి సమాచారంపై ఆధారపడి గ్లోబల్ కాంపిటీటివ్నెస్ సూచీ ర్యాంకింగ్ ను  నిర్ణయిస్తారు.  ముఖ్యంగా   మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక వాతావరణం, ఆరోగ్యం,  ప్రాధమిక విద్య, ఆర్థిక మార్కెట్ అభివృద్ధి, టెక్నలాజికల్ సంసిద్ధత, మార్కెట్ పరిమాణం, బిజినెస్ సోఫిస్టికేషన్,   ఇన్నోవేషన్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ  ఏడాది 138 ఆర్థిక వ్యవస్థలను పరిశీలించగా, గత ఏడాది  (2015-16)వీటి సంఖ్య 140 గా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో తగ్గుతున్న  నిజాయితీ కాంపిటీటివ్నెస్ కు నష్టం చేకూరుస్తోందని,  సంఘటిత  వృద్ధిని సాధించడంలో ఆయా నేతలకు కష్టంగా ఉంటోందని  డబ్ల్యు ఈఎఫ్ స్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ స్చావాబ్  చెప్పారు.

గత ఏడాది 55 వ స్థానంలో  ఉన్న ఇండియా  16 స్థానాలు జంప్ చేసింది. అలాగే బ్రిక్స్ దేశాల్లో 28వ ర్యాంకు తో రెండవ  పోటీదారుగా నిలిచింది. వరుసగా రెండో ఏడాది కూడా 16 పాయింట్లు ఎగబాకడం విశేషమని మార్కెట్ల వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశంలో విభిన్న ఆర్థిక సంస్కరణలతో ముందుకు వస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద  బూస్ట్ అని వ్యాఖ్యానించాయి.  
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)