amp pages | Sakshi

దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్

Published on Wed, 03/15/2017 - 11:38

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక టైట్ ఫైట్ గా మారబోతుంది. అన్నాడీఎంకే నుంచి ఆర్కే నగర్ కు పోటీచేయబోయే అధికారిక అభ్యర్థి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరనే అని తెలిసింది. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. దినకరన్ సైతం ఆర్కే నగర్ నుంచి పోటీకి అవకాశమొస్తే ఏ మాత్రం వెనుకాడబోనని అంతకముందే ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత రెండు సార్లు ఇక్కడి నుంచే పోటికి దిగి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
 
మరోవైపు జయలలిత అసలు వారసురాలిగా నిరూపించుకోవడానికి  ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. తనకు ఆర్కే నగర్ వాసుల మద్దతున్నట్టు తెలిపిన దీపా జయకుమార్, గత ఫిబ్రవరిలోనే ఎంజీఆర్ అమ్మ దీపా ఫెడరేషన్ పేరుతో పొలిటికల్ పార్టీని ఆవిష్కరించారు. అన్నాడీఎంకే రెబల్ ఓ పన్నీర్ సెల్వం క్యాంపు సైతం దీపా జయకుమార్ కే మద్దతివ్వాలని లేదా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్ కు మద్దతు పలికితే ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతిపక్షం డీఎంకే సైతం ఈ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. అయితే జయలలిత పార్టీ నుంచి గెంటివేయబడ్డ దినకరన్ నే అన్నాడీఎంకే పోటీకి దింపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  
 

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)