amp pages | Sakshi

జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!

Published on Wed, 01/11/2017 - 11:59

న్యూఢిల్లీ :  రిలయన్స్ జియో 4జీ.. చాలా స్లో గురూ అంటూ వచ్చిన కామెంట్లను ఛాలెంజ్గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ లో ఇంటర్నెట్ స్పీడులో దూసుకుపోయింది. 2016 డిసెంబర్లో జియో నెట్వర్క్ స్పీడు భారీగా పెరిగినట్టు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వెల్లడించింది. సెకనుకు జియో నెట్వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్ను తాకిందట. సెప్టెంబర్లో వాణిజ్య 4జీ సర్వీసులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే అత్యధికమైన స్పీడని ట్రాయ్ డేటా పేర్కొంది. నెలవారీ సగటు మొబైల్ డేటా స్పీడును ట్రాయ్ వెల్లడిస్తోంది.
 
ట్రాయ్ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో జియో డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్ను తాకింది. కాగ, నవంబర్లో జియో నెట్ వర్క్ డౌన్లోడు స్పీడు దారుణంగా ఉందని ట్రాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పీడు ఇంటర్నెట్ ను ఇస్తామన్న కంపెనీ అప్పుడు కేవలం 5.85 ఎంబీపీఎస్ స్పీడునే అందించింది. లాంచింగ్ సమయంలో జియో స్పీడు 7.26 ఎంబీపీఎస్ ఉండేది. దీంతో ఇతర టెలికాం నెట్వర్క్లతో పోలిస్తే జియో స్పీడు దారుణంగా ఉందంటూ ట్రాయ్ పేర్కొంది.
 
ఆ కామెంట్లను ఛాలెంజ్గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ నెలలో తన స్పీడును వేగంగా పెంచుకుని 18.16 ఎంబీపీఎస్ ను తాకింది. ఇతర నెట్వర్క్లు వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడు 6.7 ఎంబీపీఎస్, ఐడియా స్పీడు 5.03 ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ స్పీడు 4.68 ఎంబీపీఎస్, బీఎస్ఎన్ఎల్ స్పీడు 3.42ఎంబీపీఎస్, ఎయిర్సెల్ స్పీడు 3ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ స్పీడు 2.6 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది.  

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?