amp pages | Sakshi

అద్వానీకి మోడీ జన్మదిన శుభాకాంక్షలు

Published on Fri, 11/08/2013 - 10:59

భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి  నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం మోడీ స్వయంగా ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. అద్వానీ శుక్రవారం 86 వ వసంతంలోకి అడుగు పెట్టారు. కాగా రానున్న సాధారణ ఎన్నికల్లో  ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎంపిక చేయాలని ఈ ఏడాది మొదట్లో బీజేపీ నిర్ణయించింది.

 

అయితే పార్టీ నిర్ణయాన్ని అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో అద్వానీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. అలాగే సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన ప్రధాన అభ్యర్థిగా నరేంద్రమోడీ ఎంపిక సమావేశానికి కూడా అద్వానీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.  ఆ తరువాత ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని అద్వానీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేసింది. అయితే ఇటీవల మోడీ నిర్వహించిన ర్యాలీకి అద్వానీ హాజరయ్యారు. ఇటీవల అద్వానీ, నరేంద్రమోడీలు ఇద్దరు తరచుగా వివిధ ర్యాలీలు, పలు వేదికలపై కలుసుకుంటున్నారు.

Videos

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..

పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు

Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ

ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి

కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..

మంగళగిరిలో సీఎం జగన్ సభ

టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..

చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్

మత్స్యకారులకు గుడ్ న్యూస్

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు