amp pages | Sakshi

2017లో స్మార్ట్ఫోన్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?

Published on Sat, 12/24/2016 - 08:46

ముంబాయి : స్మార్ట్ఫోన్ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్  ఏ దేశమంటే. ఠక్కున అందరికీ గుర్తొచ్చేంది భారత్ మార్కెటే. దీంతో దేశీయ మార్కెట్లో ఎలాగైనా తమ పాగా వేసుకోవాలని ఒక్కటేమిటి అన్ని దేశాల స్మార్ట్ఫోన్ కంపెనీల చూపు మనవైపే నిలిచింది. కుప్పలు తెప్పలుగా స్మార్ట్​ఫోన్లు మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోటీ తీవ్రతరమైంది. ఈ పోటీని తట్టుకుని నిల్చోవాలంటే మార్కెట్లో తమ ముద్ర వేసుకుని తీరాల్సిందే. అలా లేదంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయి వారి దేశాలకు తరలి వెళ్లాలి. 2017 ఆర్థికసంవత్సరంలో అదే జరగబోతుందట. 2017లో మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే స్మార్ట్ఫోన్ కంపెనీల కంటే ఇక్కడి నుంచి బయటపడే కంపెనీలే ఎక్కువగా ఉండబోతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం  భారత్లో పోటీ తీవ్రతరం కావడమేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
 
గత రెండేళ్లుగా భారత్లోకి ప్రవేశిస్తున్న స్మార్ట్ఫోన్ కంపెనీలకు ఆశించిన స్థాయిలో రెవెన్యూలు ఆర్జించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ నుంచి వైదొలగడమే మంచిదని ఆ కంపెనీలు భావిస్తున్నాయట. 2017లో ఏడు కంపెనీలు భారత్లోకి ప్రవేశిస్తే, తొమ్మిది కంపెనీల మేర ఇక్కడి నుంచి వైదొలుగుతాయని అంచనావేస్తున్నట్టు కౌంటర్ పాయింట్ పేర్కొంది. భారత్లో ప్రస్తుతం 100కు పైగా స్మార్ట్ఫోన్ ప్లేయర్స్ ఉండగా.. వాటిలో టాప్ 15 కంపెనీల చేతిలోనే 90 శాతం మార్కెట్ షేరు ఉంది. మార్కెట్ నుంచి వైదొలిగే ట్రెండ్కు సంకేతంగా మైక్రోసాప్ట్, ఏషర్, ఫికామ్ కంపెనీలు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయని వివరించింది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదుచేసిన మార్కెట్, 2016లో 6 శాతం వృద్ధినే నమోదుచేసిందని తెలిపింది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)