amp pages | Sakshi

ట్రంప్ నిర్ణయం భారత ఐటీ ఉద్యోగులకే మేలు

Published on Thu, 02/09/2017 - 15:38

న్యూఢిల్లీ: హెచ్‌ 1బీ వీసాలను పరిమితం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అటు అమెరికా ఐటీ కంపెనీలపై ఇటు భారత ఐటీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? హెచ్‌ 1బీ వీసాదారుల కనీస వేతనాన్ని ఏడాదికి 60 వేల డాలర్ల నుంచి 1,30,000 డాలర్లకు పెంచాలంటూ ట్రంప్‌ ప్రతిపాదన మేరకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లు పాసవుతుందా, లేదా? పాసైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అది ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది? అమెరికా ఉద్యోగులకా, భారతీయ ఉద్యోగులకా? అనే ప్రశ్నలు తీవ్రస్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి. 
 
అమెరికాలోని ఐటీ కంపెనీలు ప్రస్తుతం హెచ్‌ 1బీ వీసాలపై వచ్చే భారతీయులకు ఏడాదికి 70 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి. అదే అమెరికన్లకు సరాసరి సగటున ఒకరికి లక్ష డాలర్లను చెల్లిస్తున్నాయి. అమెరికన్లకన్నా విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల తక్కువ జీతానికి వస్తున్నందున అధిక లాభాల కోసం ఐటీ కంపెనీలు, ముఖ్యంగా భారతీయ కంపెనీలు భారతీయ ఉద్యోగులవైపు మొగ్గు చూపుతున్నాయి. హెచ్‌ 1బీ వీసాల కోసం పోటీ పడుతున్నాయి. ఫలితంగా అమెరికన్లకు అవకాశాలు మగ్యమవుతున్నాయి. అమెరికన్లకు వారి ఉద్యోగావకాశాలను కల్పించడమే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ వీసాలపై కన్నేశారు.
 
అధిక లాభాలకు ఆశపడే ఐటీ కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించి అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటాయా? అంతమంది నిపుణులు అక్కడ దొరుకుతారా? ఏడాదికి 1,30,000 డాలర్లు చెల్లించి భారతీయులను తీసుకుంటాయా ? అన్న ప్రశ్నలకు దొరికే సమాధానాలపైనే ట్రంప్‌ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్న అంశం ఆధారపడి ఉంది. భారతీయ ఆర్ధిక వ్యవస్థకు నేడు ఐటీ రంగం వెన్నుముకగా మారిన విషయం తెల్సిందే. మొత్తం సర్వీసుల ఎగుమతుల రంగంలో 45 శాతం వాటా కలిగిన ఈ ఐటీ కంపెనీలు దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతాన్ని ఆక్రమించాయి. 37 లక్షల మంది ఉద్యోగులతో ప్రైవేటు రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఇదే. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీ కంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. ఇంతటి ప్రాముఖ్యత కల రంగం మీద ట్రంప్‌ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నదే ప్రస్తుత చర్చ.
 
అమెరికన్లు వారాంతంలో పనిచేయరని, వారు ఎక్కువగా సెలవులు పెడతారన్న ఆరోపణలు కంపెనీల నుంచి వినిపిస్తుంటాయి. అమెరికన్లకు గంటకు ఓటీ కింద వంద డాలర్లను చెల్లించాల్సి వస్తుందని, అదే భారతీయులకైతే గంటకు 60 డాలర్ల చెల్లిస్తే సరిపోతుందని, 40 డాలర్లు మిగుల్చుకోవచ్చన్నది ఐటీ కంపెనీల ఆశనే ప్రత్యారోపణలు కూడా ఉన్నాయి. హెచ్‌ 1బీ వీసాలను పరిమితం చేసేందుకు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలన్నీ బుట్ట దాఖలవుతాయని భారతీయ ఐటీ కంపెనీలు, నాస్కామ్‌ భావిస్తున్నాయి. ఈ వీసాల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో వాదించి అమెరికా కాంగ్రెస్‌లో ఈ ప్రతిపాదనలు వీగిపోయేలా చేస్తామని నాస్కామ్‌ తెలిపింది. 
 
ఇప్పటికే అమెరికా కంపెనీలు తమకు వచ్చే రెవెన్యూలో సగం శాతాన్ని ఐటీ కంపెనీలకే చెల్లిస్తున్నాయని, వీసాల కింద వేతనాల పరిమితిని పెంచడం వల్ల ఆ భారం కూడా అమెరికా కంపెనీలపైనే పడుతుందని, అవి ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాలకన్నా మరో పది శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోందని నాస్కామ్‌ వాదిస్తోంది. స్థానికంగా పెద్ద సంఖ్యలో నైపుణ్యంగల ఉద్యోగులు అమెరికాలో దొరకరని చెబుతోంది. నాస్కామ్‌ వాదనే నిజమైతే భారతీయ ఐటీ ఉద్యోగులకే వేతనాలు పెరిగి లాభం చేకూరుతుంది. భారత్‌ ఐటీ ఎగుమతుల్లో 60 శాతం వాటా ఒక్క అమెరికా నుంచే వస్తుండగా, బ్రిటన్‌ నుంచి కేవలం 17 శాతం మాత్రమే వస్తోంది. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్