amp pages | Sakshi

చారిత్రక సౌధం..

Published on Sat, 04/01/2017 - 05:23

పేరు మారనున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ భవనం
నేటి నుంచి ఎస్‌బీహెచ్‌ కనుమరుగు
75 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంకింగ్‌ సేవలు
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏడో నిజాం
అతి పెద్ద భారతీయ బ్యాంకులో విలీనమైన సేవలు


సాక్షి, హైదరాబాద్‌: సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశల సౌధం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌. ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. శనివారం నుంచి ఎస్‌బీఐలో విలీనమవుతోంది. లక్షల మంది ఖాతాదారులతో, శాఖోపశాఖలుగా విస్తరించిన ఎస్‌బీహెచ్‌ సేవలు ఇక కొత్త రూపు సంతరించు కోనున్నాయి. ఏడున్నర దశాబ్దాల హైదరాబాద్‌ లోని గన్‌ఫౌండ్రిలో కట్టించిన ‘హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌’చారిత్రక సౌథం ఇక నుంచి ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా సేవలందజేయనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం..

ఎంతో ఘన చరిత్ర..
హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ చట్టం కింద 1941లో గన్‌ఫౌండ్రిలో ఈ బ్యాంకును నిర్మించారు. సువిశాల ప్రాంగణం.. పెద్ద హాళ్లు.. ఇండో యూరోపి యన్‌ నిర్మాణ శైలిలో అత్యద్భుతంగా కట్టించిన ఈ భవనం బ్యాంకింగ్‌ రంగంలోనే వినూత్నంగా నిలి చింది. అప్పటి వరకు నిజాం ప్రభుత్వం లో సెంట్రల్‌ బ్యాంకింగ్‌ విధానం లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ లేదు. రిజర్వ్‌బ్యాంకు అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఈ క్రమంలో నిజాం సంస్థానంలో హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు.

1942 ఏప్రిల్‌ 5 నుంచి ఈ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’. ఈ కరెన్సీలోనే బ్యాంకు కార్యకలాపాలు కొనసాగాయి. హైదరాబాద్‌ సంస్థానం ఇండియాలో విలీనమయ్యాక ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’గా పేరు పెట్టారు. 1950 నాటికి 50 శాఖలతో సేవలు అందజేసిన ఎస్‌బీహెచ్‌ ఇప్పుడు 2,000 బ్రాంచ్‌లను కలిగి ఉంది. గన్‌ఫౌండ్రి బ్రాంచ్‌లో 20 వేల మంది ఖాతాదారులున్నారు. ఆసియాలోనే అతిపెద్ద లాకర్స్‌ వ్యవస్థ ఇందులోనే ఉంది. 75 ఏళ్ల ఘన చరిత్రను ప్రతిబింబించేలా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇటీవల జరిగాయి. ఈ కట్టడానికి వారసత్వ భవనంగా గుర్తింపు కూడా లభించింది.


ఇన్నేళ్ల ప్రేమతో..
దశాబ్దాలుగా ఎస్‌బీహెచ్‌ ఉద్యోగులుగా, అధికారులు గా పనిచేసిన ఎంతోమంది శుక్రవారం గన్‌ఫౌండ్రీ లోని ప్రధాన కార్యాలయం వద్ద తమ అనుభవాలను, బ్యాంకుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకున్నారు. ఇక నుంచి ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ ఉండబోదనే కఠోర వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ విలీనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘కన్నతల్లి నుంచి దూరం చేసినట్లుగా ఉంది’అంటూ పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యుల సేవలో..
ఎస్‌బీహెచ్‌ కార్యకలాపాలన్నీ సామాన్య, మధ్యతరగతి వర్గాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరహా వ్యాపార వర్గాలకు రుణాల రూపంలో అందజేయడం ద్వారా వారి అభ్యున్నతికి బ్యాంకు సేవలు దోహదం చేశాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నిజాం హయాంలోని తెలంగాణ, కర్ణాటక, గుల్బర్గా, మరఠ్వాడాలో ఎస్‌బీహెచ్‌ సేవలు విస్తరించాయి.

ఉద్యోగుల భద్రతపై స్పష్టత లేదు..
ఉద్యోగుల భద్రతపై ఎలాంటి స్పష్టతా లేదు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పైనా స్పష్టత ఇవ్వలేదు. పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్‌ విషయాల్లో ప్రస్తుతం ఎస్‌బీహెచ్‌పాలసీ వర్తించకపోతే ఉద్యోగులు చాలా నష్టపోతారు. విలీనం బాధగానే ఉంది.
– శైలేంద్ర లిమాయె, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు

ఇది ప్రజల బ్యాంకు..
ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల బ్యాంకుగా గుర్తింపు పొందింది. సేవలందజేసింది. చిన్న మొత్తాలు రుణాలు అందజేశాం. దానివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరింది. భవిష్యత్తులో అలా ఉండకపోవచ్చేమో..
– టీవీ జయలక్ష్మి, బ్యాంకు ఉద్యోగి

కన్నతల్లి నుంచి విడిపోతున్నట్లుంది
30 ఏళ్లుగా బ్యాంకులో పని చేస్తున్నా. ఇక ముందు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఉండబోదంటే జీర్ణించుకోలేక పోతున్నాను. కన్నతల్లి నుంచి దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మా ఉనికిని కోల్పోయినట్లే కదా అనిపిస్తోంది.
– కేకేవీ ప్రసాద్, ఉద్యోగ సంఘం నాయకుడు

#

Tags

Videos

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?