amp pages | Sakshi

మరో పెళ్లికి సిద్ధమైన భర్తపై భార్య.. !

Published on Sun, 11/06/2016 - 19:52

బంజారాహిల్స్: ఇద్దరు పిల్లల్ని, తనని రోడ్డుపాలు చేస్తూ మరో పెళ్ళికి సిద్ధమైన భర్తకి వ్యతిరేకంగా ఓ మహిళ పోరుబాటపట్టింది. గత మూడు రోజులుగా అత్తింటి ముందు సుజాత అనే మహిళ దీక్ష కొనసాగిస్తోంది. వివరాలివి..
 
ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నేత ఎస్పీ శ్రీను కొడుకు అశోక్ ఫిలింనగర్‌లోని నవనిర్మాణ్ నగర్ బస్తీలో నివసించే సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే, తాను సుజాతను పెళ్ళి చేసుకోలేదని, ఆమెతో సహజీవనం మాత్రమే చేశానని అశోక్‌ వాదిస్తున్నాడు. ఆమె మొదటి కొడుకు తనకు పుట్టలేదని, చిన్న కొడుకు మాత్రమే తనకు పుట్టాడని పేర్కొనడమే కాకుండా.. మరో పెళ్లికి అతను సిద్ధం కావడంతో పోలీసులు అశోక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు శుక్రవారం నుంచి అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్షకు దిగింది. అక్కడే అక్కడే వంటావార్పు చేసుకుంటూ ఆందోళన కొనసాగిస్తున్నది. ఆమెకు  ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాలు, వివిధ పార్టీల రాజకీయ నేతలు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకుంది. రోడ్డునపడ్డ మహిళకు న్యాయం చేయాలని,  అత్తింట్లోనే ఒక గదిలో ఆమెకు ఆశ్రయం కల్పించాలని హోం మంత్రి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. అయితే అది కుదరకపోవడంతో సుజాత అత్తింటిముందే యథాప్రకారంగా ఆదివారం కూడా దీక్ష కొనసాగించింది. 
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌