amp pages | Sakshi

ఈ-పంచాయతీలకు శ్రీకారం

Published on Sat, 10/03/2015 - 04:40

కామారెడ్డి: పల్లె గడపకు పౌరసేవలు సులభంగా అందిచేందుకు ఈ-పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనన, మరణ ధ్రువపత్రాల నుంచి పహాణీలు, కరెంట్ బిల్లుల చెల్లింపుల దాకా ఎన్నో సేవలను వీటిద్వారా పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాబోయే రోజుల్లో పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులు సైతం అక్కడే లభిస్తాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేటలో శుక్రవారం ఈ-పంచాయతీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పల్లె గడపకు పౌరసేవలు అందించేందుకే  ఈ-పంచాయతీలను ప్రారంభిస్తున్నామని, ఈ రోజు 104 పంచాయతీల్లో ప్రారంభించి, నెలాఖరుకు 700 గ్రామాలకు విస్తరిస్తామని చెప్పా రు. ఈ-పంచాయతీ అంటే ఎలక్ట్రానిక్, ఈజీ, ఎఫీషియెన్సీ పంచాయతీ అని వివరించారు. రాష్ట్రంలో 8,770 పంచాయతీలు, 25 వేల జనావాసాలు ఉన్నాయని.. 60 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని పేర్కొన్నారు.

వారంతా తమకు కావలసిన సేవల కోసం మండల కేంద్రాలకు తిరగాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే అన్నిరకాల సేవలు పొందవచ్చని మంత్రి చెప్పారు. సమర్థవంతమైన సేవలందించేందుకే ఈ-పంచాయతీలను ప్రారంభించామన్నారు. వీటి నిర్వహణకు ఆయా గ్రామాల మహిళలను నియమిస్తున్నామని... వారికి కనీసం రూ.5 వేలకు తగ్గకుండా ఆదాయం కల్పించనున్నామని తెలిపారు. ఇక్కడ 60 రకాల పౌరసేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

 సిగ్గులేకుండా విమర్శలు
 ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలే అయింది. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం పొందుతుంటే...  ఓర్వలేని కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారు..’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేళ్లుగా పాలించినోళ్ల పాపాలను కడిగేస్తూ, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. సభకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షత వహించగా, మంత్రి పోచారం, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)