amp pages | Sakshi

టీవీకే శాస్త్రి ఇక లేరు

Published on Tue, 03/04/2014 - 01:42

అనారోగ్యంతో చెన్నైలో మృతి
 చెన్నై, న్యూస్‌లైన్: భారతీయ కళల పరిరక్షణకు కృషి చేసిన కళాపిపాసి టి.వి.కె. శాస్త్రి (80) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. శాస్త్రి ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలిలో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని చెన్నైలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావుకు సన్నిహితంగా ఉండి సంస్థానం కార్యక్రమాలు చూసేవారు. అనంతరం కళాసాగర్ సంస్థలో పని చేస్తుం డగా సంగీత విధ్వాం సులు, కళాకారులు, రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
 
 చెన్నై, టీనగర్‌లో ఉంటున్న శాస్త్రి 1981లో పుట్టపర్తి సత్యసాయి ఆశీస్సులు, సూచనలు మేరకు జాతి సమైక్యత కోసం అన్ని రంగాల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు మద్రాసు తెలుగు అకాడమీ, భారత్ కల్చరల్ సమైక్యతా కమిటీ (బీసీఐసీ)లను స్థాపించారు. మద్రాసు తెలుగు అకాడమీకి చీఫ్ కన్వీనర్‌గా 1981 నుంచి 2008 వరకు పని చేసి 78 ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈ రెండు సంస్థల ద్వారా కళాకారులను, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నాటకాలు, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రికి  భార్య లక్ష్మి, కుమారుడు రామప్రసాద్, కుమార్తెలు విజయలక్ష్మి, సాయిశ్రీ ఉన్నారు. శాస్త్రి అంత్యక్రియలను బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించనున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)