amp pages | Sakshi

ఇక వేలిముద్రతో నగదు రహిత చెల్లింపులు

Published on Sat, 04/15/2017 - 17:55

న్యూఢిల్లీ: ఇక నగదు రహిత లావాదేవీలకు డిబెట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు అక్కర్లేదు, పేటీఎం తరహా చెల్లింపులు, నెట్‌ బ్యాంకింగ్‌ లావా దేవీలూ అవసరం లేదు. మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లడం,   ఓటీపీ నెంబర్లు చూసుకోవడం, పిన్‌ నెంబర్లు, బ్యాంక్‌ ఖాతాల నెంబర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు. త్వరలోనే ఇవన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆధార్‌ ఆధారిత భీమ్‌ యాప్‌తో సాధ్యం కానున్నాయి. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఈ యాప్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేసిన విషయం తెల్సిందే.

1. ఆధార్‌ ఆధారిత భీమ్‌ యాప్‌ బయో మెట్రిక్‌ విధానంతో నడుస్తుంది. ఆధార్‌ ఇచ్చేటప్పుడు అధికారులు వేలి ముద్రలు తీసుకున్నారుకనుక, ఆ వేలు ముద్రల ధ్రువీకరణ ద్వారానే లావాదేవీలు నడుస్తాయి.

2. ఇప్పటికే దేశంలోని బ్యాంకులన్నింటికీ ఆధార్‌ కార్డులకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాలు అధార్‌కు అనుసంధానం అయ్యాయి. ఇప్పుడు మన బ్యాంక్‌ ఖాతాలను భీమ్‌ యాప్‌కు అనుసంధానం చేస్తున్నారు. మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులుంటే చాలు. ఎక్కడైనా వేలి ముద్ర ధ్రువీకరణ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు.

3. వ్యాపారులు మాత్రం వేలి ముద్రలను స్కాన్‌చేసే పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిలో వినియోగదారుడు ఎంత చెల్లించాలో పేర్కొన్నాక వేలిముద్ర ఇస్తే చాలు. వేలి ముద్రను స్కాన్‌ చేయడం ద్వారా వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాను గుర్తించి ఆ ఖాతాలోని ఆ సొమ్మును భీమ్‌ యాప్‌ వ్యాపారస్థుని ఖాతాలోకి బదిలీ చేస్తుంది.

4. ప్రస్తుతం ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన 30 బ్యాంకులు భీమ్‌ యాప్‌ లావాదేవీల్లో పొల్గొంటున్నాయి. వాటిల్లో ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, దేనా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు ఉన్నాయి.

5. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ వర్షన్లలో పనిచేసే భీమ్‌–ఆధార్‌ యాప్‌ను గత డిసెంబర్‌లోనే ప్రారంభించగా ఇప్పటి వరకు 1.9 కోటి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

6. కార్పొరేట్‌ స్థాయి లావాదేవీలకు కాకుండా ప్రస్తుతానికి సాధారణ చెల్లింపులకు పరిమితం చేయనున్నారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)