amp pages | Sakshi

బహిష్కరించినా విప్‌కు కట్టుబడాల్సిందే

Published on Thu, 08/04/2016 - 02:34

పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు
తన తీర్పు పునస్సమీక్షకు నో
అమర్‌సింగ్, జయప్రదల పిటిషన్ కొట్టివేత  
 
న్యూఢిల్లీ: ఒక రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికైన లేదా నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పటికీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. 2010 ఫిబ్రవరి 2న రాజ్యసభ సభ్యుడైన అమర్‌సింగ్‌ను, లోక్‌సభ ఎంపీ అయిన జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2012లో బిజూ జనతాదళ్ పార్టీ నుంచి ప్యారీమోహన్ మహాపాత్ర బహిష్కరణకు గురయ్యారు. వీరు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996 నాటి తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్.. పిటిషనర్ల పదవీకాలం ముగిసిందని, దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నామని, ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబివ్వకపోవడమే సరైనదని  పేర్కొంది. 


ఆ పిటిషన్లు ఇప్పుడు వ్యర్థమంటూ తోసిపుచ్చింది. అంతకుముందు జయప్రద, అమర్‌ల లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 1996 నాటి జి.విశ్వనాథన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని, తాము పార్టీకి రాజీనామా చేయలేదని, సొంత పార్టీ పెట్టుకోలేదని తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన వారికి లేదా పార్టీలో ఉండి విప్‌ను ధిక్కరించిన వారికే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. పార్టీయే తమను బహిష్కరించింది కనుక ఏ పార్టీకీ చెందని సభ్యులుగా ఉంటామని, అందువల్ల పార్టీ విప్‌కు కట్టుబడాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు కేంద్రం ఒక  పార్టీ నుంచి ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ నియంత్రణలోనే ఉంటారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)