amp pages | Sakshi

అప్పుడే పత్తి పూతపై ఆందోళన వద్దు

Published on Thu, 08/28/2014 - 23:44

యాచారం: జానెడు పత్తి మొక్కకు పూత రావడంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు యాచారం మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్. ఈ ఏడాది అదనులో వర్షాల్లేకపోవడంతో విత్తే సమయానికంటే 30 రోజుల తర్వాత రైతులు పత్తి విత్తనాలు విత్తారు. దీంతో సరైన, సమృద్ధిగా వర్షాలు లేకపోవడం వల్ల ఎదుగుదల లేక జానెడు మొక్కకే పూత పూయడం ప్రారంభమైంది.  

వేలాది రూపాయల పెట్టుబడితో పత్తి సాగు చేస్తే జానెడు మొక్కకు పూసిన 5 వరకు పూతలు కాత కాస్తే పెట్టుబడులు ఎలా వెళ్లుతాయని రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 4 వేల హెక్టార్లకు పైగా రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేశారు. ఆలస్యంగా కురిసిన వర్షాల వల్ల, సమయానుకూలంగా కురవని వర్షంతో పత్తి మొక్కల ఎదుగుదలలో మార్పు లేకుండాపోయింది.

 దీంతో మొక్క జానెడు పెరగడంతోనే చెట్టుకు పూత ప్రారంభమవుతోంది. మొక్కకు 50 నుంచి 70 వరకు పువ్వులు పూసి కాతకాసి పత్తి వెళ్లితేనే రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. కానీ జానెడు మొక్కకు  కేవలం 5కు మించి కూడా పూత పూయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 జానెడు మొక్కకు పూతపై..
 వర్షాలు అదనులో కురవకపోవడంతో సరైన సమయంలో పత్తి విత్తనాలు విత్తకపోవడం, విత్తిన తర్వాత కూడా వర్షాల్లేక మొక్కలు ఎదగలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి సందీప్ కుమార్ పేర్కొంటున్నారు. సరైన విధంగా నీరు అందిస్తే 9 నెలల పాటు మొక్క బతుకుతుందని అన్నారు. జానెడు మొక్కకు పూత రావడంతో ఇకముందు పూత పూయదేమోనని రైతులు ఆందోళనకు గురి కావద్దన్నారు.

 ఎకరాకు 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ అందించాలి. 3 అంగుళాల దూరంలో మట్టి జరిపి మందులు పోయాలి.  దీంతో మొక్క గట్టిగా మారి ఎదుగుతుంది. పత్తిలో ఎరువులు అందిస్తే ఎదిగే గుణం ఉంది. అందుకే రైతులు ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో జానెడు మొక్కకు పూస్తున్న పూత కారణంగా సూచించిన మేరకు మందులు వేయాలని చెప్పారు. ప్రతి నెలకోసారి  క్రమం తప్పకుండా మందులు వేస్తే మొక్క పెరగడమే కాకుండా గణనీయమైన పూత, కాత వస్తుందన్నారు.

చీడపురుగులు తగలకుండా బొట్టు పద్ధతిని పాటించాలన్నారు. 100 మిల్లిమీటర్ల మోనోక్రోటోఫాస్, అర లీటర్ నీటిలో కలిపి కాండానికి బొట్టు అంటించాలని ఆయన సూచించారు. ఇలా 15 రోజులకోసారి చేస్తే రసం పీల్చే పురుగులు దరిచేరవన్నారు. ప్రస్తుతం డివిజన్‌లోని పత్తి మొక్కలు 45 నుంచి 60 రోజుల వయసులో ఉన్నట్లు, సరైన విధంగా సూచనలు పాటిస్తే దిగుబడి గణనీయంగా ఉంటుందని ఆయన తెలిపారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)