amp pages | Sakshi

పాడి పశువు ఏటా ఈనాలంటే..

Published on Tue, 09/09/2014 - 01:35

రోజూ 30-40 కిలోల పచ్చి గడ్డి వేయాలి
 బ్రీడింగ్ సీజన్‌లో ప్రతి పాడి పశువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తొలకరి వర్షాలకు పెరిగిన పచ్చి గడ్డి పశువుల్లో పోషక విలువలు పెంచుతుంది. ఈ రోజుల్లో ప్రతి పశువుకూ రోజుకు కనీసం 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి వేయాలి. అందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పచ్చిగడ్డి లేని రైతులు ప్రతి పశువుకూ కనీసం కిలో దాణా, వారానికి ఒకసారి నాలుగు వేల ఇంటర్‌నేషన్ యూనిట్ల విటమిన్ ఇంజక్షన్ ఇప్పించాలి. రోజుకు 25 నుంచి 50 గ్రా. ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమంగా ఎదకు వస్తాయి.
 
 ఎదను వేకువ జామున  గుర్తించవచ్చు  
 పశువు చూడి కట్టించడమనేది ఎదను గుర్తించడం పైనే ఆధారపడి ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు పశువు అరవడం, మానం వెంట తెల్లని తీగలు వేయడం, మానం ఉబ్బి లోపల ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది. అదే పనిగా మూత్రం పోయడం, పశువుల పైకి ఎక్కడం లాంటి పనులు చేస్తుంటాయి. ఇంకా మేత సరిగా తినకపోవడం, పాలు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

వేసవిలో గేదేల్లో ఎద లక్షణాలు మరీ తక్కువగా ఉంటాయి. కొన్ని ముర్రా, గ్రేడేడ్ ముర్రా జాతి గేదె ల్లో ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలు ప్రదర్శించని పరిస్థితి ఉంటుంది. దీనినే మూగ ఎద అంటారు. గేదెలు ఎక్కువగా రాత్రి సమయాల్లో ఎదకు వస్తాయి. ఆ లక్షణాలను వేకువ జామున సులభంగా గుర్తించవచ్చు. పశువుల్లో మూగ ఎదను గుర్తించడానికి టీజర్ ఆంబోతును ఉపయోగించవచ్చు. ఎక్కువ సంఖ్యలో పశువులుంటే టీజర్ ఆంబోతు తప్పని సరిగా ఉండాలి. పశువు ఒకసారి చూడి కట్టకుంటే 18 నుంచి 24 రోజుల మధ్య తప్పనిసరిగా ఎదకు వస్తుంది.

 సరైన సమయంలో చూడి కట్టించాలి
 సాధారణంగా ఆవులు, గేదెల్లో ఎదకాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ దశలో పశువు మానం వెంట పల్చని నీళ్ల లాంటి తీగలు పడుతుంటాయి. పశువు వెన్ను మీద నిమిరితే తోక కొంచెం పైకి ఎత్తుతుంది. ఈ దశలో తప్పని సరిగా చూడి కట్టించాలి. చూడి కట్టించే సమయంలో పశువును బాగా కడగాలి. ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా చేయాలి.

కొంతమంది రైతులు ఒకే సారి రెండు వీర్యదానాలు చేస్తుంటారు. అలా కాకుండా ఆరు గంటల వ్యవధిలో రెండో వీర్యదానం చేయిస్తే కట్టు శాతం పెరుగుతుంది. దున్నపోతులతో కట్టించేటప్పుడు దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. గర్భస్రావాలు కలుగజేసే వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాకే.. వాడటం మేలు. రెండున్నరేళ్ల లోపు.. పదేళ్లు దాటిన దున్నపోతులతో చూడి కట్టించరాదు. ఒకే సారి ఎక్కువ పశువులను దున్నపోతుతో దాటిస్తే చివరి పశువులో చూడి శాతం తగ్గుతుంది. రెండేళ్లకోమారు దున్నపోతును మార్చాలి. చూడి కట్టించాక పశువును ఆ రోజు బయటకు విడవకూడదు. చల్లగా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. చల్లని నీటితో గేదేలను కడగాలి.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)