amp pages | Sakshi

మోక్ష మార్గం

Published on Fri, 11/04/2016 - 03:46

దైవం తరువాత మానవుడికి అత్యంత ఆదరణీ యులు, గౌరవనీయులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం లేని మానవ జన్మ నిరర్థకం. కాని దురదృష్టవశాత్తు ఈనాడు తల్లిదండ్రుల్ని సంతా నం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచుగా వినబడుతున్నాయి. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి, రక్తాన్ని చెమటను ఏకం చేసి అహర్నిశలూ శ్రమ పడి, ప్రతి అవసరాన్ని తీర్చి ప్రయోజకుడిగా చేసిన నాన్న ఈనాడు సంతానానికి భారమైపోతున్నారు. కొంతమంది దౌర్భాగ్యులు కన్నవారిని వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో చేర్చడం, వంతులేసుకొని తల్లినొక దగ్గర, తండ్రినొక దగ్గర ఉంచడం, ‘తలా ఒక నెల’ అని పంచుకోవడం లాంటి దురదృష్టకర చేష్టలకు పాల్పడడం మనం చూస్తున్నాం.

వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయంలో వంతుల పేర ఆ వృద్ధ దంపతుల్ని భౌతికంగా విడదీసి, వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న సంతానాన్నీ మనం చూస్తున్నాం. బాగా చదువుకున్నవాళ్లు, ఉన్నత హోదాలు వెలగబెడుతున్నవాళ్లు, హితబోధలు వల్లె వేసేవాళ్లు కూడా వృద్ధ తల్లిదండ్రుల మానసిక స్థితిని పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటే అలాంటి వారిని ఏమనాలి? కొంత మంది, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారిని పట్టించు కోరు. ప్రేమగా చూడరు, పట్టెడన్నం పెట్టరు. వారి ఆరోగ్యం పట్టించుకోరు. కాని చనిపోయిన తరువాత వేలు, లక్షలు ఖర్చుచేసి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఖరీదైన సమాధులు కట్టిస్తారు. వాటిపై పరిచే పూలకే వేల రూపాయలు వెచ్చిస్తారు. దీనివల్ల ప్రయో జనం? వారి జీవితకాలంలో ఆప్యాయంగా ప్రేమగా చూసుకోకుండా తదనంతరం ఎన్ని చేసినా వ్యర్థమే.

అందుకే మమతల మూర్తి ముహమ్మద్‌ (స) ‘తల్లి    పాదాల చెంత స్వర్గమున్నదని, తండ్రి స్వర్గానికి సింహ ద్వారమని, వారిసేవ చేసి వారి ప్రేమను, వారి ఆశీర్వా దాలను పొంది, వారిని ప్రసన్నం చేసుకోకపోతే స్వర్గప్రవేశం అసాధ్యమని’ ఉపదేశించారు. కాబట్టి బాల్యంలో వారు మనల్ని ఎంత కరుణతో, వాత్స ల్యంతో పెంచి పోషించారో, వారి వృద్ధాప్యంలో మనం వారిని అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలతో సేవలు చేయాలి. వారి బాగోగుల్ని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిగతుల్ని పట్టించుకోవాలి. వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారు నొచ్చుకునే విధంగా, వారి మనసుకు కష్టం కలిగే విధంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రవర్తించకూడదు.  దైవం మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి, వారి ప్రేమ ఆశీర్వాదాలు పొంది తన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.
– యండి. ఉస్మాన్‌ ఖాన్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)