amp pages | Sakshi

ఆన్‌లైన్‌లో..మత్స్యకార్మికుల వివరాలు

Published on Wed, 01/17/2018 - 12:18

కులవృత్తుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా..అర్హులకే అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మత్స్యకారుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించి సమగ్ర సర్వే చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 3 బృందాలు మత్స్యకారుల పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. అనంతరం ఈ వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

పరకాల రూరల్‌ :  జిల్లా వ్యాప్తంగా 182 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 15,570 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 35 మహిళా సంఘాల్లో 1600 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సభ్యుల పూర్తి వివరాలతోపాటు గ్రామాల్లోని సంఘాలు, చెరువుల వివరాలను మత్స్య శాఖ నమోదు చేస్తోంది. మత్స్యకారుల సర్వే కోసం అధికారులు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించారు. ఇందులో 21 కాలమ్స్‌తో మత్స్యకారుల పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మత్స్యకారుడి పూర్తి పేరు, తండ్రి పేరు, లింగం, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్‌ నంబర్, ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, నామినీ తదితర పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా మత్స్యకార సంఘాలకు సంబంధించి 18 కాలమ్స్‌తో రూపొందించిన ఫార్మాట్, చెరువుకు సంబంధించి 17 కాలమ్స్‌ ఫార్మాట్‌ రూపొందించి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 10 మండలాల్లో సర్వే పూర్తయ్యింది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

పథకాల పారదర్శకత కోసమే..
ప్రభుత్వం మత్స్యకారులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు పక్కదారి పట్టకుండా, ఒక్కరే పలుమార్లు లబ్ధి పొందకుండా, అర్హతలను బట్టి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ సర్వేను చేపట్టింది. ఆన్‌లైన్‌ ప్రక్రియతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పథకాల అమలు పారదర్శకంగా ఉంటుంది.

మత్స్య శాఖ అమలుచేసే పథకాలు..
100 శాతం సబ్సిడీతో చేపల మార్కెట్ల అభివృద్ధి
90 శాతం సబ్సిడీతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు
80 శాతం సబ్సిడీతో టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌
75 శాతం సబ్సిడీతో చేపల తరలింపునకు వాహనాలు
75 శాతం సబ్సిడీతో వలలు, తెప్పెలు, ట్రేలు
రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీహాల్‌ భవనాలకు రూ.9 లక్షల చొప్పున కేటాయింపు
సభ్యత్వం ఉన్న ప్రతి మత్స్యకారుడికి రూ. 6 లక్షల ప్రమాద బీమా సౌకర్యం

సర్వేతో మత్స్యకారులకు ఉపయోగం
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మత్స్యకారుడి పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో అతడి స్థితిగతులను అనుసరించి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుంది. ఈ విధానంతో శాఖ పూర్తి పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది. – నరేష్‌కుమార్‌నాయుడు, ఏడీ, మత్స్యశాఖ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌