amp pages | Sakshi

ఐదు రోజుల్లో ఇల్లు రెడీ.. 5.50 లక్షల ఖర్చు.. 60 ఏళ్లకు పైగా మన్నిక!  

Published on Sun, 04/02/2023 - 09:04

ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టే స్థాయిని దాటేసి.. నచ్చిన మోడల్‌లో ఇంటిని ప్రింటింగ్‌ చేసుకునే స్థితికి వచ్చేశాడు మనిషి. నెలలు, సంవత్సరాల తరబడి కట్టే ఇళ్లను సైతం త్రీడీ ప్రింటింగ్‌ హౌసింగ్‌ టెక్నాలజీ సాయంతో గంటలు.. రోజుల్లోనే చకచకా నిర్మించేస్తున్నాడు. ఎలానో ఒకసారి తెలుసుకుందాం..

సాక్షి, అమరావతి: భారత నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీ చేరింది. శ్రమ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగించడం ద్వారా ఇళ్లను సిద్ధం చేయడంపై మద్రాస్‌ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఫలించాయి. సంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఇళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ‘త్వస్త మాన్యుఫాక్చరింగ్‌ సొల్యూషన్స్‌’ పేరుతో స్టార్టప్‌ సంస్థను స్థాపించి 3డీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు.

ప్రయోగాత్మకంగా ఐఐటీ ప్రాంగణంలోనే కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఓ ఇంటిని నిర్మించారు. ఒకే అంతస్తులో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.5.50 లక్షల ఖర్చుతో.. ఆధునిక హంగులతో 5 రోజుల్లోనే ఇల్లు పూర్తయిపోయింది.  సామగ్రి కొనుగోలు, రవాణా, లేబర్‌ ఖర్చులు వంటివేమీ లేకుండా నిర్మించిన ఈ ఇళ్లు 50 నుంచి 60 ఏళ్లపాటు నాణ్యతతో మన్నుతాయని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.  

‘త్వస్త’తో జత కట్టిన ఎల్‌ అండ్‌ టీ 
త్వస్త స్టార్టప్‌ అందుబాటులోకి తెచ్చిన ఈ 3డీ ఇల్లు దేశాన్ని ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతోనే ఆధునిక హంగులతో డబుల్‌ బెడ్రూమ్‌ ఇంటిని పూర్తిచేయగలగడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ త్వస్త మాన్యుఫాక్చరింగ్‌ సొల్యూషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బెంగళూరులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల 3డీ ప్రింటెడ్‌ భవన నిర్మాణం పూర్తి చేసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ భవన నిర్మాణానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి సైతం మంజూరు చేయడం గమనార్హం. కొత్తగా వచ్చిన  3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేసిందని.. ఈ టెక్నాలజీలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడితే తక్కువ సమయంలోనే లక్షలాది మందికి సొంతింటి కలను నిజం చేయవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.  

ప్లాన్‌.. కాంక్రీట్‌.. ప్రింటింగ్‌ 
సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్‌ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్‌ (బ్లూప్రింట్‌) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్‌ చేసి ఇంటి బ్లూప్రింట్‌ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్‌ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్‌ ప్రారంభించే ముందు.. పేస్ట్‌ లాంటి బిల్డ్‌ మిశ్రమాన్ని (కాంక్రీట్‌) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్‌ హ్యాండ్‌ కదిలేందుకు వీలుగా బిల్డింగ్‌ సైట్‌ చుట్టూ పట్టాలు అమరుస్తారు.

అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్‌’ బటన్‌ ఆన్‌ చేయగానే ప్రింటర్‌ దానికదే ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్‌ ద్వారా కాంక్రీట్‌ మెటీరియల్‌ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్‌ డ్రయర్‌ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్‌ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)