amp pages | Sakshi

ఎప్పటి లెక్కలు అప్పటికే

Published on Sat, 04/10/2021 - 04:09

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో వాటా, కేటాయింపు, వినియోగం లెక్కలు ఆ నీటి సంవత్సరంతోనే ముగుస్తాయని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తేల్చిచెప్పారు. మే 31లోగా తెలంగాణ వాటా జలాలను వినియోగించుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంటే జూన్‌ 1 నాటికి మిగిలిన జలాలు ఉమ్మడి కోటా కిందకు వస్తాయని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయపురే అధ్యక్షతన వర్చువల్‌ పద్ధతిన శుక్రవారం త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మాట్లాడుతూ.. మే 31లోగా తమకు కేటాయించిన జలాలను వినియోగించుకోలేమని.. మిగిలిన జలాలను 2021–22లో వాడుకుంటామని ప్రతిపాదించారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ నీటి సంవత్సరంతోనే ముగుస్తాయని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో డీఎం రాయపురే స్పందిస్తూ.. ఈ అంశాన్ని కేంద్ర జల సంఘానికి (సీడబ్యూసీకి) నివేదిస్తామన్నారు. సీడబ్ల్యూసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కోటాలో మిగిలిన జలాల అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టానికంటే దిగువ వరకు నీటిని వినియోగించుకున్నారని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తిప్పికొట్టారు. ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు జలాలను తరలించడం వల్లే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి కంటే దిగువకు చేరిందని గుర్తు చేశారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, విద్యుత్‌ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కి ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. నాగార్జునసాగర్‌ కుడి కాల్వ కింద తాగునీటి అవసరాల కోసం ఏడు టీఎంసీలను విడుదల చేయాలని నారాయణరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై డీఎం రాయపురే స్పందిస్తూ పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలకు సూచించారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌