amp pages | Sakshi

తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించండి

Published on Tue, 03/16/2021 - 03:55

సాక్షి, అమరావతి: విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. అపెక్స్‌ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)ల అనుమతి తీసుకోకుండా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టుల పనులను ముందుగా పరిశీలించాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ పనులను నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా ఉల్లంఘించి, పనులు చేస్తోందని అనేకమార్లు బోర్డుకు చేసిన ఫిర్యాదులను గుర్తుచేసింది. కొత్తగా ఆయకట్టుకు నీరందించేందుకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. వాటా నీటిని వాడుకుని.. పాత ఆయకట్టుకు సమర్థవంతంగా నీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రాజెక్టుల పనులను పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేస్తామని.. అందుకు నోడల్‌ అధికారిని ఏర్పాటుచేయాలని తమను కోరడం సబబుకాదని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి. నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలివీ..

► అపెక్స్‌ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీల నుంచి అనుమతి తీసుకోకుండా.. విభజన చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నదీ జలాలను వాడుకోవడానికి తెలంగాణ సర్కార్‌ కొత్తగా పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీలు), డిండి (30 టీంఎసీలు), భక్తరామదాస (5.5 టీఎంసీలు), తుమ్మిళ్ల ఎత్తిపోతల (5.44), మిషన్‌ భగీరథ (23.44) చేపట్టింది. అలాగే, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 22 నుంచి 25.4, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ పనులు చేపట్టింది.
► అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిసెంబర్‌ 11, 2020న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి తెలంగాణ సర్కార్‌కు లేఖ రాశారు. అయినా పనులను కొనసాగిస్తూనే ఉంది.
► ఈ నేపథ్యంలో.. నిజాలను నిర్ధారించుకునేందుకు ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీని ఏర్పాటుచేయాలని బోర్డును కోరాం. దాంతో కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీ ఏర్పాటైంది.
► రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వస్తామని.. అందుకు నోడల్‌ అధికారిని ఏర్పాటుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి ఈనెల 4న కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఎన్జీటీ కూడా రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని కృష్ణా బోర్డును ఆదేశించలేదు. కానీ, కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ అమలుచేస్తోందా లేదా అన్నది పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేయడం సమంజసం కాదు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)