మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’
Published on Mon, 02/01/2021 - 08:30
సాక్షి, అమరావతి: సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్ కోరారు. (చదవండి: జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురు)
#
Tags