amp pages | Sakshi

గత సర్కార్‌ పాలనంతా అవినీతి, అక్రమాలే..

Published on Wed, 09/02/2020 - 04:52

సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలను కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించడంతో తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య,  ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వేర్వేరుగా హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వీటిపై కౌంటర్‌ దాఖలు చేశారు. 

కౌంటర్‌లో ముఖ్యాంశాలివీ... 
► నిర్ణయాలను సమీక్షించే కార్యనిర్వాహక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పాత నిర్ణయాలను సమీక్షించడం ద్వారా తప్పులను గుర్తించి సరిదిద్దవచ్చు. గత సర్కారు హయాంలో పాలన మొత్తం అవినీతి, సహజ వనరుల దోపిడీ, గనుల అక్రమ తవ్వకాలు, భూముల ఆక్రమణ, పర్యావరణ హననం, రైతుల పట్ల నిర్లక్ష్యం, అక్రమాలతో కూడుకున్నది. 
► రాజధాని భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం తేల్చింది. అందులో ఎవరెవరి పాత్ర ఉందో ఆధారాలతో సహా వెల్లడించింది. నివేదికపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది.  మంత్రి వర్గ ఉప సంఘం సిఫారసుల మేరకే రాజధాని భూ అక్రమాలపై సిట్‌ ఏర్పాటైంది.  
► సిట్‌ ఏర్పాటు వల్ల వర్ల రామయ్యకు, రాజేంద్ర ప్రసాద్‌కు నష్టం ఏమిటి?  గత సర్కారు కొందరు వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.  
► ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలందరికీ ఉంది.  విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ను ఏర్పాటు చేసినందున వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాం.  

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)