amp pages | Sakshi

నాడు– నేడు.. బడి అందం చూడు   

Published on Thu, 07/28/2022 - 12:48

కడప ఎడ్యుకేషన్‌: ఒకప్పుడు  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేక సమస్యలతో సతమతమయ్యేవారు. విద్యార్థులకు తగినన్ని తరగతి గదులు లేక చెట్లకింద, వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది.  దీంతోపాటు  పిల్లలు ఆడుకునేందుకు సరైన వసతులు లేక.. పాఠశాలకు ప్రహరీలు లేక దారుణంగా ఉండేది. ఇలాంటి దుస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమస్యలన్నింటికి స్వస్తి పలుకుతూ నాడు– నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. దీంతో నేడు చిన్నారులు విరబూసిన నవ్వులతో అక్షరాలు నేర్పే పాఠశాల చెంతకు పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్తుకు పునాది పడే  ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపుతున్నారు.  

రెండవ విడత.. చకచక
ప్రభుత్వం జిల్లాలో రెండో విడత నాడు– నేడు పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు మొదలై పలుచోట్ల చురుగ్గా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పనుల పూర్తికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో 1028 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 322.83 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను సత్వరం పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.   

రూ. 144.72 కోట్లతో నాడు– నేడు, అదనపు తరగతి గదులు  
జిల్లావ్యాప్తంగా 18 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత  పాఠశాలలు, 69 ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తంగా  99 పాఠశాలల్లో కేవలం అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. 68 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ఉన్నత పాఠశాలల్లో నాడు నేడుతోపాటు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఈ పనులకు రూ. 144.78 కోట్లు కేటాయించారు. 

కేవలం నాడు – నేడు పనులకు  
కేవలం నాడు – నేడుకు సంబంధించి జిల్లాలో 461 ప్రాథమిక పాఠశాలలకు, 38 ప్రాథమికోన్నత పాఠశాలకు, 63 హైస్కూల్స్‌ దీంతోపాటు మరో 203 అంగన్‌వాడీ కేంద్రాలకు కలుపుకుని రూ. 178.05 కోట్లను కేటాయించారు.  

పనులను పారదర్శకంగా నిర్వహించాలి
నాడు– నేడు రెండవ విడత కింద చేపట్టనున్న పనులను చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా చేపట్టాలి. ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత లోపించకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు అదనపు తరగతులను నిర్మిస్తున్నాం. ఈ పనులను ఆగస్టు చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి.               
– అంబవరం. ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి

8 పది రకాల సౌకర్యాల కల్పన
నాడు– నేడు మొదటి విడత పనులకు అదనంగా మరో పని చేర్చి రెండో విడతలో పది రకాల పనులను చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు మరమ్మతులు, తాగునీటి వసతి మెరుగుపరిచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సురక్షిత తాగునీటి శుద్ధి పరికరాలను అమర్చనున్నారు. అన్ని తరగతి గదులకు ట్యూబ్‌లైట్లు, సిలింగ్‌ఫ్యాన్‌లు, బాలబాలికలకు విడివిడిగా నిరంతరం నీటి సౌకర్యంతో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ ఏర్పాటు, బ్లాక్‌బోర్డు స్థానంలో గ్రీన్‌బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, తరగతి గదులకు పెయింటింగ్, పాఠశాల ఆవరణంలో గ్రానైట్‌ పనులు, ఉపాధిహామీ పథకంలో ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)