amp pages | Sakshi

జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం 

Published on Fri, 02/05/2021 - 10:40

సాక్షి, గుంటూరు : పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పలు పంచాయతీల్లో ఏకగ్రీవాలకే ఓటు వేశారు. రికార్డు స్థాయిలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి దశలో తెనాలి డివిజన్‌లో 337 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా 20 శాతం పంచాయతీలు పోటీ లేకుండా అభ్యర్థుల గెలుపొందారు. పల్లెల్లో అభివృద్ధి, ప్రశాంతతకు ప్రజలు ఓటు వేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా పెంచడం, పార్టీలకు అతీతంగా ఏకగ్రీవాలను వైఎస్సార్‌ సీపీ ప్రోత్సహించడంతో ఈ దఫా ఏకగ్రీవాలు భారీస్థాయిలో జరిగాయి. 2013లో జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 15 శాతమే ఏకగ్రీవాలు జరిగాయి. టీడీపీ పంతం కోసం బలవంతంగా అభ్యర్థులను బరిలోకి దించకపోతే మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యేవని రాజకీయ విశ్లేష కులు పేర్కొంటున్నారు. టీడీపీ ఉనికిని కాపాడుకోవడం కోసం పచ్చపల్లెల్లో చిచ్చురేపుతోందని ప్రజలు మండిపడుతున్నారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న తెనాలి డివిజన్‌లో నియోజకవర్గాల వారీగా రేపల్లెలో 17, ప్రత్తిపాడులో ఆరు, వేమూరులో 12, బాపట్లలో 15, పొన్నూరులో 10, తెనాలిలో ఏడు పంచాయతీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. 17 మేజర్‌ పంచాయతీలు ఏకగ్రీవం వైపు పయనించడం అభినందనీయం.  

270 పంచాయతీలలో పోలింగ్‌... 
తెనాలి డివిజన్‌ పరిధిలో 337 పంచాయతీలకు జనవరి 31న గడువు ముగిసే సమయానికి 1,757 మంది నాటికి నామినేషన్లు సమరి్పంచారు. పరిశీ లన తర్వాత 96 నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో 1,661 మిగిలాయి. 3,442 వార్డు స్థానాలకు 8,048 నామినేషన్లు దాఖలు చేయగా, 176 తిరస్కరణకు గురవ్వగా 7,872 నామినేషన్లు మిగిలాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత  270 పంచాయతీల్లో ఈ నెల 9న పోలింగ్‌ జరగనుంది.   

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు 
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటరి్నంగ్‌ అధికారులు ప్రకటించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తును వరుస క్రమంలో ప్రకటించారు. వాటిని అక్షర క్రమంలో మొదటి వ్యక్తికి మొదటి గుర్తు, రెండో వ్యక్తికి రెండో గుర్తు ... ఇలా ఎంతమంది పోటీలో ఉంటే అన్ని గుర్తులను 
కేటాయించారు.   

జోరందుకున్న ప్రచారం 
పంచాయతీ పోరు తుది దశకు చేరడంతో ప్రచారం జోరందుకుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా, వారి గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్లకు చేరేలా ప్రచురణ పత్రాలు, ఫ్లెక్సీలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలి్చతే  ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలసి అభ్యర్థించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో ప్రచారం కూడా బాగా పెరిగింది.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)