amp pages | Sakshi

చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ 

Published on Wed, 11/22/2023 - 05:22

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో చంద్ర­బాబు ముఠాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ ఏసీబీ న్యాయ­స్థానం అనుమతి ఇచ్చింది. సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయ­స్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్ర­బాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13గా టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌ ఉన్నారు.
 
కుంభకోణంలో నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో వారి ఆస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఏపీ, తెలంగా­ణలో టెరాసాఫ్ట్‌ కంపెనీ, తుమ్మల గోపీచంద్‌ తది­త­రుల పేరిట ఉన్న రూ.114 కోట్ల విలువైన ఏడు స్థిరా­స్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపా­ద­నను హోం శాఖ ఆమోదించింది. దాంతో ఆస్తుల అటా­చ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయ­స్థాన­ంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందుకు న్యాయ­స్థానం అనుమతినివ్వడంతో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ సిద్ధమవుతోంది.

చంద్రబాబు పన్నాగమే..
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి సీఎం చంద్రబాబు తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఫైబర్‌నెట్‌ టెండర్లను కట్టబెట్టారు. మొత్తం రూ.3,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. మొదటి దశ కింద రూ.330 కోట్ల ప్రాజెక్టును టెండర్లలో ఎల్‌–1గా వచ్చిన బిడ్డర్‌ను కాదని మరీ టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టారు. అందుకోసం బ్లాక్‌ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీని ఆ జాబితా నుంచి తొలగించి, టెండర్లలో పాల్గొనేందుకు అనుమ­తించారు.

ఏపీ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీయే టెండర్లలో పాల్గొని, పనులు దక్కించుకుంది. ఇది పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధం. టెరా­సాఫ్ట్‌ కంపెనీ పనులు కూడా నాసిరకంగా చేసి, రూ.144.53 కోట్లను దారి మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.

అటాచ్‌ చేయాలనినిర్ణయించిన ఆస్తులు
  ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటే­శ్వ­ర­రావు పేరిట గుంటూరులో ఉన్న 797 చద­రపు అడుగుల ఇంటి స్థలం.
 కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖ­పట్నం కిర్లంపూడి లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్‌.
 టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్‌ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, ఆయన పేరిటే యూసఫ్‌గూడలో ఉన్న మరో ఫ్లాట్‌.
  తుమ్మల గోపీచంద్‌ భార్య పవన దేవి పేరి­ట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయి­నాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి.

Videos

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)