amp pages | Sakshi

బాబు హయాంలో మద్యం సిండికేట్లకు సలాం

Published on Sun, 12/06/2020 - 04:22

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అవినీతిని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తూర్పారబట్టింది. లోపభూయిష్టంగా జరిగిన పన్నుల వసూళ్లు, నమోదైన కేసుల్లో అవకతవకలను ఎత్తి చూపింది. మద్యం సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు కాగ్‌ తేల్చింది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో ఆడిట్‌ చేయాల్సిన కార్యాలయాలు 103 ఉండగా.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కాగ్‌ 14 కార్యాలయాలను మచ్చుకు తనిఖీ చేసింది. మొత్తం 41 కేసుల్లో రూ.6.71 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించింది. అంటే మిగిలిన కార్యాలయాల్లో ఎంత మేర అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని కాగ్‌ పేర్కొంది. కాగ్‌ ఎత్తి చూపిన తప్పులను ఎక్సైజ్‌ శాఖ కూడా అంగీకరించడం గమనార్హం. 

ఇష్టానుసారంగా అనుమతులు..: రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప నగర పాలక/పురపాలక సంస్థల్లో విలీనం చేశారు. ఇక్కడి మద్యం షాపులకు అదనపు లైసెన్సు ఫీజులు వసూలు చేయాలి. కానీ ఎక్సైజ్‌ శాఖ దీన్ని పట్టించుకోలేదు. కాగ్‌ తనిఖీ చేసిన సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన రూ.2.01 కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. పర్మిట్‌ రూంలకు ఫీజులు వసూలు చేయకుండా మద్యం సిండికేట్లతో కుమ్మక్కై రూ.3.16 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.


అలాగే బార్లను అనుమతించిన విస్తీర్ణంలో కాకుండా.. బ్లూ ప్రింట్‌ను మించి వ్యాపారం నడిపినా పట్టించుకోలేదు. వీటికి అదనపు రుసుం వసూలు చేయలేదు. కాకినాడ, ఒంగోలు, రాజమండ్రిలో 13 మంది లైసెన్సుదారులకు రూ.94.11 లక్షల అదనపు ఫీజు విధించలేదు. ఇక కల్లు చెట్లకు వర్తించే రేట్లను తక్కువగా చేసి చూపడంతో రూ.28.89 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో కల్లు చెట్లకు అద్దెలను తక్కువగా విధించినట్లు కాగ్‌ తేల్చింది. 

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌