amp pages | Sakshi

ప్రభుత్వం తరఫున పంటల బీమా కంపెనీ 

Published on Wed, 02/10/2021 - 03:32

సాక్షి, అమరావతి: పంటల బీమా కోసం ప్రభుత్వం తరఫున బీమా కంపెనీ ఏర్పాటుపై సత్వరం చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రైతులకు 2020–21 ఖరీఫ్‌ బీమా సొమ్ము ఏప్రిల్‌లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, మే నెలలో ఈ ఏడాది రైతు భరోసా తొలివిడత ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రైతులు ఎక్కడా మోసాలకు గురికాకుండా వారికి అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేశానని, ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాకో రైతు భరోసా పోలీసు స్టేషన్లపై ఆలోచన చేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. దీనిపై పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని వ్యవసాయశాఖకు సూచించారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏం చెప్పారంటే..

కౌలు రైతుల చట్టంపై వివరించాలి..
పొలంబడిలో భాగంగా కౌలు రైతుల కోసం చేసిన చట్టంపై అవగాహన కల్పించాలి. సాగు ఒప్పంద పత్రం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని వివరించాలి. ఆర్బీకేల్లో దీనికి సంబంధించిన వివరాలతో పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఆర్బీకేల్లో రైతులకు ఎలాంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో తెలియచేసేలా హోర్డింగ్స్‌ ఉండాలి. విలేజ్‌ క్లినిక్స్, గ్రామ సచివాలయాల కార్యక్రమాలకు సంబంధించి కూడా హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలి. దీనివల్ల ప్రజలకు మెరుగైన అవగాహన కలుగుతుంది.

సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి..
సేంద్రీయ వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. మిల్లర్లే నేరుగా ఆర్బీకేల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలన్న సందేశం గట్టిగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్రం చేసిన వ్యవసాయ, ఆక్వా చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలి. 

జనతా బజార్లపై ప్రతిపాదనలు
జనతా బజార్ల ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా అధికారులు వివరించారు. ఐదు వేల జనాభా ఉన్న చోట 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటు కానున్నాయి. 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్నచోట 5 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటవుతాయి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు జనతా బజార్లలో లభించాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని సీఎం స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్దతు ధరలు లభించాలని, మరోవైపు వినియోగదారులకు సరుకులు తక్కువ ధరకు లభించేలా ఉండాలన్నారు. జనతా బజార్ల ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.

ఏపీ అమూల్‌ ప్రాజెక్టు, ఆక్వా హబ్‌లపై సమీక్ష
ఏపీ అమూల్‌ ప్రాజెక్టు, ఆక్వా హబ్‌ల ఏర్పాటుపై సీఎం జగన్‌ సమీక్షించారు. మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు, నిధుల సమీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. సమీక్షలో అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ స్పెషల్‌ సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్‌ పి.యస్‌. ప్రద్యుమ్న, ఏపీ డీడీసీ ఎండీ అహ్మద్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)