amp pages | Sakshi

వేసవిలో విద్యుత్‌ కొరత రాకూడదు

Published on Wed, 03/10/2021 - 03:50

సాక్షి, అమరావతి: వేసవి దృష్ట్యా వచ్చే మూడు నాలుగు నెలల్లో విద్యుత్‌ కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంత మేరకు విద్యుత్‌ కావాలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యుత్‌ ఉత్పత్తితో పాటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఉచితంగా, ఆక్వా రైతులకు సబ్సిడీపై.. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌పై సీఎం చర్చించారు.

ఈ రంగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులను సకాలంలో విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్‌ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. అవి భారంగా తయారవుతాయన్నారు.

సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జెన్‌ కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15 యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలని, బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఇంధన శాఖ ఎక్స్‌ అఫిషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)