amp pages | Sakshi

విశాఖలో మిలాన్‌-2022 నిర్వహించడం గర్వకారణం: సీఎం జగన్‌

Published on Sun, 02/27/2022 - 14:37

అప్‌డేట్స్‌:

► సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం పర్యటన ముగించుకుని సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు.

► ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం మీద డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌, డాల్ఫిన్‌ నోస్‌, కృష్ణజింకను ముద్రించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్‌ డెస్టినీ అని అన్నారు.
► సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్‌ తెలిపారు. ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని అన్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ  సీఎం జగన్‌ అభినందనలు తెలియజేశారు. 
► మిలాన్‌-2022 ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మిలాన్‌-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు అని అన్నారు. 

► మిలాన్‌-2022 ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్‌ ప్రారంభమైంది. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను ప్రదర్శించారు.

సముద్రతీరంలో నావికా దళం అబ్బురపరిచే విన్యాసాలు:
6000 అడుగుల ఎత్తులో 6 మంది ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతా, ఆపదలో ఉన్నవారిని కాపాడే సాహసం, సముద్రం తీరంలో వాహనాలతో శత్రువులపై ఛేజింగ్, మిషన్ గన్స్‌తో శత్రువులను వెంటాడే విధానం, శత్రువులు వెన్నులో వణుకు పుట్టించె విధంగా ధైర్యసాహసాల ప్రదర్శన, మిత్ర దేశాలతో పరస్పరం సహకరించుకొనే విధంగా విన్యాసాలు, యుద్ద నౌకల నుంచి గురి తప్పని టార్గెట్, సముద్ర తీరంలో హెలికాప్టర్ల గస్తీ విన్యాసాలును ప్రదర్శించారు.

 ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో సాయంత్రం పరేడ్‌ జరగనుంది. మిలాన్‌-2022 ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. గంటన్నరపాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్‌ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది పాల్గొంటారు.

  ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు.
  నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సీఎం వైఎస్‌ జగన్‌ సందర్శించారు. 
 విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు చేరుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు తూర్పు నావికా దళం గౌరవ వందనం చేసింది.


 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను సీఎం జగ​న్‌ ప్రారంభించనున్నారు.

సాక్షి, విశాఖపట్నం: అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్‌–2022లో కీలకమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను బీచ్‌ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు.

నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్‌ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్ జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)