amp pages | Sakshi

బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?

Published on Wed, 02/15/2023 - 07:55

సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పెండింగ్‌ బిల్లులు, గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పులపై ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలను ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. నిపుణుల పేరుతో అంతులేని అబద్ధాలు అచ్చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరా నిపుణులు? పేర్లు వెల్లడించే ధైర్యం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ లెక్కలను గణాంకాల సహితంగా వెల్లడిస్తోందని, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నివేదికలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేశారు. లేని అప్పులు, పెండింగ్‌ బిల్లులు, గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పులు ఉన్నట్లు తప్పుడు గణాంకాలు ఎలా ప్రచురిస్తారని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినప్పటికీ రూ. 9.16 లక్షల కోట్లు అంటూ ఏ గణాంకాలు, ఆధారాలు ప్రకారం ఈనాడు కథనాలను ప్రచురించింది? వాటిని పట్టుకుని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎలా మాట్లాడతారు? బడ్జెట్‌ లోపల అప్పులతో పాటు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కార్పొరేషన్‌ అప్పుల గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజెంటేషన్‌తో సవివరంగా తెలియచేసినా ఈనాడు ఊహాగానాలతో, నిపుణులు అంచనాల పేరుతో అవాస్తవ కథనాలను ఎలా ప్రచురిస్తుంది?  రాష్ట్ర అప్పులకు సంబంధించి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అవే తప్పుడు వార్తలను పథకం ప్రకారం పదేపదే ప్రచారం చేస్తోంది.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు రెట్టింపు అయినట్లుగా ఇప్పుడు అందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. రాష్ట్ర అప్పులపై టీడీపీ ఎంపీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరి్థక శాఖ ‘‘స్టేట్‌ ఫైనాన్సెస్‌– ఏ స్టడీ ఆఫ్‌ స్టేట్‌ బడ్జెట్‌’’ అర్బీఐ నివేదికతో స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో తట్టుకోలేక దు్రష్పచారానికి పాల్పడుతున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అప్పులు 62.78 శాతం మాత్రమే పెరిగాయి. అప్పులు రెట్టింపు కావాలంటే ఒక్క 2023–24లోనే రూ.1,01,150 కోట్ల మేర అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో 7.5 శాతానికి సమానం. కేంద్ర నిబంధనల ప్రకారం జీఎస్‌డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత సర్కారు పాలనలో మాదిరిగా అప్పులు రెట్టింపు అయ్యేందుకు ఆస్కారమే లేదు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇప్పటి మాదిరిగా ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకున్నా, కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు లేనప్పటికీ అప్పులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కోవిడ్‌తో ఆరి్థక ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా అధిగమించి సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లను పేదలకు నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకుంది.

విభజన తర్వాత 2014 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,13,797 కోట్లు ఉండగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2019 మే నాటికి రూ.2,71,797.56 కోట్లకు ఎగబాకాయి. టీడీపీ పాలనలో అప్పులు ఏకంగా 138.84 శాతం అంటే 2.38 రెట్లు పెరిగాయి. సగటున ఏటా అప్పుల్లో 19.02 శాతం వృద్ధి నమోదైంది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,71,797.56 కోట్లుగా ఉన్న అప్పులు 2022 – 23 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లలో అప్పుల్లో 62.78 శాతం వృద్ధి నమోదైంది. అంటే సగటున 13.55 శాతమే. ఇది టీడీపీ సర్కారు సగటు 19.02 శాతంతో పోలిస్తే తక్కువే.

గత సర్కారు ఎన్నికలకు ముందు రెండు నెలల్లో ఓట్ల కోసం భారీగా అప్పులు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా  2019 ఏప్రిల్‌ 9న ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పులు చేసింది. నాడు నోరు మెదపని టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు నిబంధనల ప్రకారం అప్పులు తీసుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోతున్నట్లు విషం చిమ్ముతున్నాయి. వీటిని పట్టుకుని విషయంపై అవగాహన లేని పవన్‌కళ్యాణ్‌ లాంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వాస్తవానికి టీడీపీ సర్కారు నిబంధనలకు మించి ఐదేళ్లలో రూ.48,128.70 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. దీనిపై ఈనాడు కలం కదల్లేదు ఎందుకో మరి? ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో నిబంధనలకు లోబడి రూ.2,696.76 కోట్లు తక్కువ అప్పులు చేసినా, ఇంత మెరుగ్గా ద్రవ్య నిర్వహణ చేస్తున్నా ప్రశంసించకపోగా బురద చల్లడం ఏమిటి? 

పెండింగ్‌ బిల్లులు ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు పచ్చి అబద్ధాలను ప్రచురించింది. వీటికి ఆధారాలున్నాయా? మొత్తం పెండింగ్‌ బిల్లుల వివరాలను వెల్లడించే ధైర్యం ఉందా? పెండింగ్‌ బిల్లులపై గత ఏడాది సెపె్టంబర్‌ 19వ తేదీన అసెంబ్లీ వేదికగా ఆరి్థక మంత్రి స్పష్టంగా చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సరికి పెండింగ్‌ బిల్లులు రూ.40,172 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.21,673 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. గత సర్కారు పెండింగ్‌ బిల్లుల గురించి ఒక్క ముక్క రాయకుండా తప్పుడు వార్తలు ఎందుకు? ఇదేనా ఈనాడు పాటించే జర్నలిజం, మీడియా విలువలు?

 రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు రాష్ట్ర అప్పులు ఎలా అవుతాయి? నాన్‌ గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు అంటూ ఈనాడు ప్రచురించిన కథనం అవాస్తవం. ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే రుణాలు ప్రభుత్వ అప్పుల కిందకు రావు. ఆమాత్రం కనీస అవగాహన లేకుండా కథనాలు ప్రచురించారు. ఉదాహరణకు ఎన్‌టీపీసీ తీసుకునే రుణాలు కేంద్ర ప్రభుత్వ అప్పుల కిందకు రావు. టీటీపీ హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లు రూ.55,108.94 కోట్లు నాన్‌ గ్యారెంటీ రుణాలు తీసుకుంటే వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? నాన్‌ గ్యారెంటీ రుణాలను కేంద్రం అప్పులుగా ఎప్పుడైనా చూపించిందా?

ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పుల్లో ఎక్కడా దాపరికం లేకుండా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం అసెంబ్లీకి వెల్లడించాం. 2021 డిసెంబర్‌ 31 నాటికి  పూచీకత్తు రుణాలు రూ.1.17,730 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీకి వెల్లడించాం. 2022లో మరికొన్ని గ్యారెంటీ రుణాలు పెరిగినా రూ.1.27 లక్షల కోట్లకు మించదు. అలాంటిది రూ.1.78 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు ఏ ఆధారాలతో రాసింది?

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకే గ్యారెంటీ రుణాలున్నాయి. ఆర్బీఐ, 15వ ఆర్థిక సంఘం నిర్థారించిన మేరకే రాష్ట్ర అప్పులున్నాయి. కంపెనీల యాక్ట్‌ కింద ఆడిట్‌ లేకుండా లెక్కలను ఎవరైనా రిలీజ్‌ చేస్తారా? ఆడిట్‌ పూర్తయ్యాక వాటిని వెల్లడిస్తారు. ఈలోగా తమ ఇష్టానుసారంగా లెక్కలు గట్టి రాసుకుంటామనే ధోరణిలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోంది.

నిపుణుల అంచనాల పేరుతో వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. నా బ్యాంకు ఖాతాల్లో ఎన్ని డబ్బులున్నాయో నిపుణులకు ఎలా తెలుస్తుంది? ఊహాగానాలతో, ఇష్టం వచి్చన అంకెలతో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)