amp pages | Sakshi

ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు

Published on Mon, 10/30/2023 - 04:33

సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయట­పెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యా­యాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరా­లను సమీకరించింది.

ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయ­స్థానా­లను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూము­ల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. 

రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు 
సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటా­యించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతు­లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్‌ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగి­పో­యాయి.

ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చిన వారికి మేలు­చేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదా­ల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వు­ల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది.

అందుకు అనుగుణంగానే పూలింగ్‌కు భూములి­చ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటా­యించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటా­యిం­చేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరి­ష్కృ­తంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభు­త్వంపై బు­ర­ద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది.  

Videos

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?