amp pages | Sakshi

కొన ప్రాణంతో ఉన్న వృద్ధుడికి ఊపిరి

Published on Sat, 03/20/2021 - 04:32

నెల్లూరు(అర్బన్‌): ఏమైందో ఏమోగానీ వారం రోజులుగా ఆ వృద్ధుడు ఇంట్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు చనిపోయాడనుకుని భావిస్తున్న తరుణంలో 108 సిబ్బంది ప్రాణం పోశారు. సాహసంతో వైద్యం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని బతికించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన ఈ ఘటన 108 సేవల గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. కాశిం అనే వృద్ధుడు వాచ్‌మేన్‌గా పనిచేస్తూ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే వారం రోజులుగా ఆ వృద్ధుడి ఇంటి తలుపు మూసే ఉంది. బయట తాళం వేయలేదు. స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం ఆ ఇంటి పక్కింటి వారికి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి తలుపు తడితే తీయలేదు.

లోపల గడియ వేసి ఉంది. కిటికీలోంచి చూస్తే వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ (ఎమర్జెన్సీ టెక్నీష్ యన్‌) శ్రీనివాస్, పైలట్‌ రమేష్ తో కలిసి వెంటనే ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. తలుపులు పగుల గొట్టారు. వృద్ధుడు మరణించి ఉంటాడని స్థానికులు భావించారు. ఈఎంటీ శ్రీనివాస్‌ ఆ వృద్ధుడిని పరీక్షించాడు. నాడీ కూడా అందడం లేదు. బీపీ రికార్డు కాలేదు. కొన ఊపిరి ఉందని గ్రహించి ఆస్పత్రి వరకూ వెళ్లకుండా వెంటనే 108 వాహనంలోకి తీసుకెళ్లి వైద్యం చేశాడు. సెలైన్‌లు ఎక్కించడంతో పాటు, అత్యవసర ఇంజెక్షన్లు చేశాడు. దీంతో కాస్త నాడీ దొరకడంతో వెంటనే పెద్దాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి క్రమేపీ మెరుగవుతోంది. 108 సిబ్బంది వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన విషయం తెలుసుకున్న 108 జిల్లా మేనేజర్‌ పవన్‌కుమార్, నెల్లూరు డివిజన్‌ సూపర్‌వైజర్‌ రఫీ.. ఈఎంటీ శ్రీనివాస్‌ను, పైలట్‌ రమేష్ ను అభినందించారు.  

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)