amp pages | Sakshi

వేగంగా కోలుకుంటున్న ఆర్థిక రంగం

Published on Tue, 10/05/2021 - 04:25

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభంతో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక రంగం వేగంగా కోలుకుంటోంది. గతేడాది కోవిడ్‌తో భారీగా పడిపోయిన పన్నుల ఆదాయం ఇప్పుడు తిరిగి కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకుంటున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌ సంక్షోభానికి ముందు 2019–20లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయం రూ.21,967.90 కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది ఇదే కాలానికి రూ.26,133.33 కోట్లకు చేరుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.55,535 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్‌లో నిర్దేశించారు. 2019–20లో మొదటి ఆరు నెలల కాలానికి రూ.10,911.03 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది ఇదే కాలానికి రూ.14,661.10 కోట్లకు చేరింది. ఇందులో ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పాత సంవత్సరాలకు సంబంధించిన అడహాక్‌ చెల్లింపులు, జీఎస్టీ పరిహారం, రుణాల రూపంలో ఇవ్వడంతో రూ.3,337 కోట్ల అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందింది.

ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతో..
కోవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టింది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతో ఆర్థిక కార్యకలాపాలు కోవిడ్‌ పూర్వ స్థితికి వేగంగా చేరుకోవడానికి దోహదపడ్డాయని అధికారులు తెలిపారు. దీనికితోడు తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్‌ కూడా సత్ఫలితాలను ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రూ.1,772 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈ ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 

తగ్గిన లిక్కర్‌ ఆదాయం
వాణిజ్య పన్నుల ఆదాయంలో జీఎస్టీ, పెట్రోలియం, వృత్తి పన్ను వంటి అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైనా లిక్కర్‌ ఆదాయంలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు 2019–20 మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,735.48 కోట్లుగా ఉన్న లిక్కర్‌పై వ్యాట్‌ ఆదాయం ఈ ఏడాది రూ.4,104.26 కోట్లకు పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా మద్యం షాపుల సంఖ్య తగ్గించడం, ఎక్సైజ్‌ సుంకాలను పెంచడంతో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. లిక్కర్‌పై వ్యాట్‌ ఆదాయం తగ్గడానికి ఇదే కారణమన్నారు. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం రూ.5,215.14 కోట్ల నుంచి రూ.7,245.93 కోట్లకు, వృత్తి పన్నుల ఆదాయం రూ.106.24 కోట్ల నుంచి రూ.122.03 కోట్లకు చేరుకుంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)