amp pages | Sakshi

అమరావతిని ఏకపక్షంగా నిర్ణయించారు 

Published on Tue, 08/25/2020 - 04:53

సాక్షి, అమరావతి: రాజధానిని నిర్ణయించేప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధిని, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని.. అమరావతి విషయంలో అది జరగలేదంటూ విశ్రాంత ఐజీ సుందర్‌ కుమార్‌దాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల్లో తననూ ప్రతివాదిగా చేర్చుకుని, తన వాదనలూ వినాలంటూ ఆయన ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలివీ.. 

గత ప్రభుత్వానికి రహస్య అజెండా ఉంది..
► గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఏకపక్షంగా నిర్ణయించింది. ప్రపంచంలో అత్యధిక రాజధానులన్నీ ప్రజలందరి ఆమోదం మేరకు తటస్థ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి.  
► ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం నామమాత్రంగా మార్చేసింది. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా విజయవాడ–గుంటూరులలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో చాలా వ్యూహాత్మకంగా తీర్మానం చేసింది. 
► విజయవాడ–గుంటూరులో రాజధాని ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించి.. ఆ మేరకు అప్పటి ప్రభుత్వం పావులు కదిపింది. దీని వెనుక అప్పటి ప్రభుత్వానికి రహస్య అజెండా ఉంది. 
► పాలక వర్గానికి చెందిన వారికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. ఇందులో అనేక రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి.  
► ఆఫ్రికా దేశాల్లో నియంతలు ఓ నిర్ధిష్ట రహస్య అజెండాతో తమకు కావాల్సిన ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించేవారు. తద్వారా తమ వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలకు పెద్దపీట వేసేవారు. అమరావతి విషయంలోనూ అలాగే జరిగింది.  
► అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌ పర్యావరణం, సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానెల్‌ నివేదిక ఇచ్చింది. దీంతో ప్రపంచ బ్యాంక్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది.  
► ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసం, పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ సమీక్ష చెల్లదు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)