amp pages | Sakshi

భారీ వర్షంతో స్తంభించిన రాకపోకలు

Published on Fri, 09/02/2022 - 23:17

రామసముద్రం : మండల పరిధి రామసముద్రంలోని చెంబకూరు ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురవడంతో రాకపోకలు స్తంభించాయి. గంట పాటు కురుసిన వర్షంతో చెరువులు, కాలువలు నిండిపోయాయి. పంట పొలాలపై వరదనీరు ప్రవహించడంతో రైతులు నష్టపోయారు. మనేవారిపల్లె గ్రామానికి వెళ్లే రోడ్డు, పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి.

నడింపల్లె వడ్డివానిచెరువు గండి పడడంతో ఎస్‌ఐ రవీంద్రబాబు సహకారంతో గ్రామస్తులు గండిని పూడ్చారు. పై గడ్డ ప్రాంతంలో శ్రీనివాసపురం–రామసముద్రం రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూగవాడి ఉన్న గౌనివాని కాలువ వరద నీటితో ప్రవహించింది. ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవడం ఇదే మొదటి సారిని ప్రజలు తెలిపారు.

అలాగే నారిగానిపల్లె పంచాయతీ పూలగుంట్ల గ్రామంలో లక్ష్మన్నకు చెందిన ఆరు గొర్రెలు కాలువ దాటే సమయంలో వరదనీటికి కొట్టుకుపోయాయి. గొర్రెల కాపరులు వరదనీటిలో కొట్టుకెళ్తుండగా గ్రామస్తులు రక్షించారు. ఈ భారీ వర్షంతో టమాట, కాలీఫ్లవర్, కొత్తిమీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. వడ్డిపల్లె, నడింపల్లె చెరువులను ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు. 

సంపతికోట ఏటిలో తప్పిన ప్రమాదం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోట ఏటిలో గురువారం మళ్లీ నీటి ప్రవాహం వరదలా ఉప్పొంగింది. సంపతికోట నుంచి గుడిపల్లికి పాల ఆటో వెళ్తూ ఏటిలో అదుపు తప్పి బోల్తా పడింది. పాలన్నీ నీటి పాలయ్యాయి. అయితే అక్కడే ఉన్న ఓ మినీ లారీ సాయంతో ఆటోను ఒడ్డు వైపు లాగడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇదే ఏటిలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిక్కుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనలో ఇంజనీరింగ్‌ చదివే ఓ యువతి నీటిలో కొట్టుకుపోయి అర్ధాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. ఎగవనున్న కర్టాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు  చెరువులు నిండి మిగులు వరదలా ప్రవహిస్తుండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంపతికోటకు చేరుకుని వరద ఉద్ధృతిని పరిశీలించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)