amp pages | Sakshi

కొనసాగుతున్న కోలాహలం

Published on Mon, 01/11/2021 - 03:38

సాక్షి నెట్‌వర్క్‌: ‘వదినా.. నీ స్థలం ఎక్కడొచ్చింది. రాఘవత్తా.. నీకు ప్లాటెక్కడిచ్చారు. పోనీలే భార్గవీ ఇన్నాళ్లకు నీకు ఇల్లొచ్చింది. నీ కల నెరవేరింది. ఇక నీ దిగులు పోయినట్టే..’ ఊరూరా ఎక్కడ చూసినా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 17వ రోజైన ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కోలాహలంగా సాగింది. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 80,985 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, 15 వేల మందికి టిడ్కో ఇంటి పత్రాలను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లాలో 72 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,02,225 మంది పట్టాలు పొందారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 7,239 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో హక్కు పత్రాలు అందజేశారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 1,751 టిడ్కో ఇళ్ల పత్రాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 17వ రోజున 917 మందికి పట్టాలిచ్చారు. వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 669 మంది పట్టాలు అందుకోగా.. ఇప్పటివరకు 2,41,400 మంది లబ్ధి పొందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 2,506 ఇళ్ల పట్టాలను అందించారు. 17 రోజుల్లో 60,101 మంది పట్టాలు అందుకున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం 250 మందికి ఇళ్లపట్టాలు, టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో 77,676 మంది లబ్ధి పొందారు.

నేడు విరామం
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో ఏడాది సొమ్ము జమ చేయనున్న దృష్ట్యా సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విరామం ప్రకటించింది. అధికారులంతా అమ్మఒడి కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ యథాతథంగా కొనసాగుతుంది.

ఈ చిత్రంలో పట్టా అందుకుంటున్న మహిళ పేరు సజ్జల హేమలత. అనంతపురంలోని 25వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌. ఈమె టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక పథకాల అమలులో కులం, మతం, వర్గం, పార్టీలు చూడకుండా.. అర్హులందరికీ పథకాలను వర్తింప చేస్తామని సీఎం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఆదివారం అనంతపురం సమీపంలోని కురుకుంట లే–అవుట్‌లో సజ్జల హేమలతకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పట్టా అందజేశారు. పార్టీలు చూడకుండా, పూర్తి పారదర్శకతతో టీడీపీ నేతకూ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వ తీరును అంతా ప్రశంసించారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌