amp pages | Sakshi

టిడ్కో ఇళ్లకు లైన్‌ క్లియర్‌ 

Published on Sun, 06/05/2022 - 12:31

పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఒకపక్క ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే.. మరోపక్క టిడ్కోలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండేళ్ల పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ఉపయోగించడం వల్ల వాటిని లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగా ఉండడంతో వేగంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

భీమవరం(ప్రకాశం చౌక్‌): ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి శుక్రవారం టిడ్కో అధికారులు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా అధికారులతో టిడ్కో ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రిజిస్ట్రేషన్ల పనులు ముమ్మరం చేశారు. ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. 

300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితం... 
నూతన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో 20,784 టిడ్కో ఇళ్లు నిర్మించారు. ఏ కేటగిరీలో 300, బీ కేటగిరీలో 365, సీ కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లు నిర్మించగా, ఇవన్నీ కలిపి 20,784 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇందులో నాలుగు పట్టణాల్లో కలిపి 300 చదరపు అడుగుల ఇళ్లు 6944 నిర్మించగా, ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను ఫేజ్‌–1లో లబ్ధిదారులకు ఈ నెల 15 నుంచి అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.  

రిజిస్ట్రేషన్లు వేగవంతం
జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్లాట్లను లబ్ధిదారుల పేరిట ఉచిత రిజస్ట్రేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మెప్మా విభాగం అధికారులు ఆయా పట్టణాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి ప్లాట్లను రిజస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇళ్లు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశించడంతో రిజస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఉచితంగా రిజస్ట్రేషన్‌ చేసి ప్లాట్లు అప్పగించడంపై లబ్దిదారులు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఇలా... 
ఇప్పటివరకు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 3758 మందికి ప్లాట్లు రిజస్ట్రేషన్‌ చేశారు. అందులో భీమవరంలో 900, పాలకొల్లులో 1458, తాడేపల్లిగూడెంలో 1400 చొప్పున ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేపట్టారు. మూడు పట్టణాల్లోని ఫేజ్‌–1 లబ్ధిదారుల్లో 2577 మంది రూ.68.39 కోట్ల బ్యాంకు రుణాలు పొందారు.  

ఫేజ్‌–1 కోసం ముమ్మరంగా ఏర్పాట్లు 
జిల్లాలో ఫేజ్‌–1లో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు కేటగిరీల ఇళ్లూ ఈ ఫేజ్‌లో ఉన్నాయి.  
– ఎం.స్వామినాయుడు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)