amp pages | Sakshi

ఇకపై ఉద్యోగ వివరాలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్..

Published on Fri, 07/24/2020 - 16:50

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో 'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ' శాఖ పాత్ర మరింత కీలకం కానుందని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐటీ శాఖపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇండస్ట్రియల్ పాలసీతో పాటుగా, ఐటీ పాలసీనీ ప్రకటించేలా సమాయత్తమవ్వాలి. సైబర్‌ సెక్యూరిటీకి టాప్‌ ప్రయారిటీ ఇవ్వాలి. ఐటీలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి పెట్టాలి. చౌకగా సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ అత్యంత అనుకూలం. ఐటీకి గమ్యస్థానంగా నిలిచే అన్ని వనరులు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. (ఆ ఒప్పందంతో కీలక మలుపు..)

ఐటీ పాలసీపై తుది కసరత్తు పూర్తిచేయడంలో వేగం పెంచాలి. పరిపాలన విభాగం కిందకి ఈ -ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్, తద్వారా వేగంగా మరిన్ని సేవలందించే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. నైపుణ్యంలో భాగంగా హై-ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ), ఐటీ ప్రమోషన్స్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ), ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్‌) అన్ని రంగాల ఉద్యోగావకాశాలకు సంబంధించిన డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌‌ఛేంజ్‌పై చర్చించారు. (చౌక‌గా ఇంట‌ర్నెట్ అందించ‌డ‌మే ల‌క్ష్యం)

ఉపాధి వివరాలకు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌
విద్య, అర్హతలు, అవకాశాలను బట్టి నేరుగా ఉపాధి వివరాలు తెలుసుకునే విధంగా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొక్యూర్‌మెంట్, ఇన్‌ఫ్రా & కమ్యునికేషన్స్ కింద ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సెర్వీసెస్ (ఏపీటీఎస్‌) 'మీ-సేవ' టెక్నికల్‌గా గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపైనా చర్చించారు. దీనిపై జీవో ఇచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఐటీ పరిధిలోనే ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి అధికారులకు సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(ఏపీఐటీఏ), ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీఎస్‌ఏసీ), సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్స్ (ఎస్‌ఏపీనెట్‌)లను ఒక తాటిపైకి తీసుకురావడంపైనా కార్యదర్శి భాను ప్రకాశ్, సలహాదారులతో మంత్రి చర్చించారు. (ఫ్యాబ్రిక్‌ హబ్‌గా ఏపీ)

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ఎటువంటి సమస్యలు ఉండకూడదు
కరోనా ఉధృతి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు అనుగుణంగా అన్ని విధాల సన్నద్ధానికి మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఐటీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో ఎటువంటి సమస్య రాకుండా చూడాలి. ఇంటర్నెట్ కనెక్టిటవిటీ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ బడ్జెట్, వినియోగంపై తదితర శాఖాపరమైన ఆర్థిక అంశాలపై మంత్రి ఆరా తీశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.

 ఐటీ శాఖలో ఐఎస్‌బీ భాగస్వామ్యంపై శిక్షణ, సంస్థాగత నిర్మాణాలపై అధ్యయనం, ఆర్థిక సర్దుబాటు, పెట్టుబడుల ఆకర్షణ అంశాలలో ఐఎస్‌బీ సౌజన్యం, వినియోగించుకునే పద్ధతిపైనా చర్చించారు. ఐటీ శాఖపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షకు హాజరైన వారిలో ఐటీ శాఖ కార్యదర్శి యేటూరు భాను ప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి బి సుందర్, ఐటీ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి (టెక్నికల్), దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (టెక్నికల్), ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. (టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)