amp pages | Sakshi

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

Published on Fri, 10/01/2021 - 17:53

సాక్షి, విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ శనివారం నుంచి వంద రోజలు పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. స్వచ్ఛాంధ్రపదేశ్‌ నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు ​వెల్లడించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో  13 వేలకు  పైగా  ఉన్న  పంచాయితీల్లో సాలీడ్  వేస్ట్  మేనేజ్మెంట్   సిస్టం  ప్రవేశ  పెడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో 10  వేల  మంది  గ్రామ  పంచాయితీ  కార్మికులు పాల్గొంటారని తెలిపారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నాం అని తెలిపారు.

చదవండి: రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ సాధనకు ప్రజలంతా కలిసి రావాలి: బొత్స
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌-క్లాప్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ రేపు(శనివారం) ప్రారంభిస్తారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘‘ఉదయం పదిన్నరకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ సాధనకు ప్రజలంతా కలిసి రావాలి. పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయి. శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌లు ఇవ్వనున్నాం. పబ్లిసిటీపై కాదు.. పనులపైనే సీఎం జగన్‌ దృష్టి పెట్టారు. పూర్తిగా రాష్ట్ర నిధులతోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఏపీలో అమలు చేస్తోన్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. 
(చదవండి: సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చు: బొత్స)

బొత్స మాట్లాడిన అంశాలు.. 

క్లీన్ ఆంద్రప్రదేశ్ కోసం చెత్త సేకరించే వాహనాలని‌ సీఎం జగన్ ప్రారంభిస్తారు

పట్టణాలలో 3097 హైడ్రాలిక్చగార్బేజ్ ఆటోలని... 1771 ఇ-ఆటోలని ప్రారంభిస్తున్నాం.

38 వేల మంది శానిటరీ వర్కర్స్ ఇందులో పాల్గొంటున్నారు.

తడి, పొడి చెత్త సేకరణకి ప్రత్యేకంగా వాహనంలో మూడు విడిభాగాలు ఉంటాయి.

దేశ వ్యాప్తంగా ఎంపికైన 9 పట్టణాలకి మూడు పట్టణాలు ఎపిలో ఉన్నాయి.

గ్రామస్ధాయిలో, పట్టణ స్ధాయిలో ఈ కార్యక్రమాన్ని.

ప్రజల నుంచి యూజర్ ఛార్జీల క్రింద సేకరించిన డబ్బులతోనే ఈవాహనాల కొనుగోలుకి ఖర్చు చేశాం.

కేంద్ర నిధులతో ఎక్కడా ఈ వాహనాలు ఖర్చు చేయలేదు.

యూజర్ ఛార్జీల రూపేణా వసూలు చేసిన డబ్వులు సరిపోకపోతే ప్రభుత్వమే గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించాం.

కేంద్రం నుంచి వచ్చిన వెయ్యి కోట్ల రూపాయిలు ఈ కార్యక్రమం కోసం కాదు.

అందుకే ప్రజలని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులని చేస్తున్నాం.

వర్షాలు తగ్గిన తర్వాత రోడ్ల మరమ్మత్తులు, అభివృద్ది చేస్తాం.

గత అయిదేళ్లలో నిర్మించిన రోడ్లు రెండేళ్లకే మరమ్మత్తులకి వచ్చాయి.

రోడ్లు నిర్మిస్తే కనీసం అయిదు నుంచి ఏడేళ్ల వరకు మరమ్మత్తులకి రాకూడదు.

గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం ఎంత నాసిరకంగా సాగిందో ప్రస్తుత పరిస్ధితులే ఉదాహరణ.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?