amp pages | Sakshi

వేగంగా పోలవరం దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు

Published on Tue, 08/10/2021 - 03:42

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను ఇప్పటికే దాదాపు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను వేగవంతం చేసింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కుడి వైపున 96 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో డయా ఫ్రమ్‌ వాల్‌ (పునాది) నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా సోమవారం ప్రారంభించింది. నెలాఖరు నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ను రక్షిత స్థాయికి పూర్తి చేసి.. సెప్టెంబరులో కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న సుమారు 0.4 టీఎంసీల నీటిని బయటకు తోడే పనులు చేపట్టనుంది.

నీటిని పూర్తిగా తోడివేశాక.. ప్రధాన డ్యామ్‌ అయిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులు చేపట్టి నిరంతరాయంగా చేయడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దాని అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రణాళిక మేరకు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వేను రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసింది. 

జల వనరుల శాఖాధికారులు, డయాఫ్రమ్‌ వాల్‌ పనులు జరుగుతున్న దృశ్యం 

కాఫర్‌ డ్యామ్‌లపై ప్రత్యేక దృష్టి 
పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేది ప్రధాన డ్యామ్‌ అయిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌లోనే. ఈ డ్యామ్‌ను గోదావరి నది గర్భంలో ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా (గ్యాప్‌–1లో 564 మీటర్లు, గ్యాప్‌–2లో 1,750 మీటర్ల మేర ఈసీఆర్‌ఎఫ్‌ను, గ్యాప్‌–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్‌ డ్యామ్‌) నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించేందుకు నదికి అడ్డంగా 2,480 మీటర్ల పొడవున 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను.. స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన నీరు గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడువున నిర్మించే ఈసీఆర్‌ఎఫ్‌ వైపు ఎగదన్నకుండా 1,613 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి.

ఇందులో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను 40 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. ఈ పనులు నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌కు పునాదిని జెట్‌ గ్రౌటింగ్‌ విధానంలో చేశారు. కుడి వైపున నేల మృదువుగా ఉండటం వల్ల 96 మీటర్ల పొడవున డయా ఫ్రమ్‌ వాల్‌ను నిర్మిస్తున్నారు.  నెలాఖరు నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను రక్షిత స్థాయికి పూర్తి 
చేయనున్నారు.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)