amp pages | Sakshi

వరదల ఎఫెక్ట్‌: ముంపులో లంక గ్రామాలు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

Published on Thu, 08/11/2022 - 19:35

సాక్షి, విజయవాడ : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధారల నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో, లంక గ్రామాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి. 

ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం నుంచి మొత్తం 4.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోని నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు 3.50 లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు.. పులిచింతల గేట్లు 20 ఎత్తివేత వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి లక్ష క్యూసెక్కులను సముద్రంలోకి చేరుతోంది. కాగా, రాత్రికి వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో, సాగర్‌ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగింది. పోలవరంలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక, ధవళేశ్వరం నుంచి 13.76 లక్షల క్యూసెక్కులు సముద్రంలకి వచ్చి చేరుతోంది. గొట్టా బ్యారేజ్‌ నుంచి 25 వేల క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్‌ పార్కులు  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)