amp pages | Sakshi

రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Published on Mon, 10/05/2020 - 08:40

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో పార్వతీపురంలో 7 సెం.మీ, కురుపాం, వీరఘట్టం, బొబ్బిలి, గురుగుబెల్లిలో 5, పమిడి, బలిజిపేట, వేపాడ, సీతానగరం, పాలకొండ, అమలాపురంలో 3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

‘కృష్ణా’లో తగ్గిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా, ఉప నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 41,436 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో గేట్లను ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పూర్తిగా మూసివేశారు. కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 27,460 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవాకు 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌లోకి 45,945 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,650, ఎడమ కాలువకు 5,782, ఏఎమ్మార్పీకి 1,800, ఎఫ్‌ఎఫ్‌సీకి 600 క్యూసెక్కులు వదులుతున్నారు.

విద్యుత్‌ కేంద్రం ద్వారా 29,142 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 45,828 క్యూసెక్కులు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 91,642 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలో గోదావరి నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 1,52,376 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1.41 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి వంశధార వరద కొనసాగుతుండగా 7,500 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదులుతున్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌