amp pages | Sakshi

ఏపీలో సంక్షేమం అద్భుతం

Published on Sun, 02/13/2022 - 03:33

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా అమలు చేస్తున్నారని కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్‌ అథవాలే కితాబునిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శనివారం విజయవాడలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఎంపీలుగా పని చేసినప్పటి నుంచి తనకు సాన్నిహిత్యం ఉందని, ఇద్దరూ స్నేహభావంతో మెలిగే వ్యక్తులని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ  ప్రజలు బ్రహ్మండమైన మద్దతు పలికారన్నారు. జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న తీరు చాలా బాగుందన్నారు. ప్రధానంగా దళితుల ఉద్ధరణకు సీఎం జగన్‌ చేస్తున్న కృషి బాగుందని తెలిపారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలపలేదని, కానీ ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని సానుకూలంగా ఉన్నారని, అందుకు అనుగుణంగానే కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు సీఎం జగన్‌ అనేకసార్లు ప్రధానిని కలిశారని, వారి ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు.

ఈ నెల 17న జరిగే సమావేశంలో రాష్ట్రానికి విభజన హామీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందన్నారు. ఒక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందడంలేదని, ఈ పరిస్థితిలో మూడు రాజధానులు సరికాదన్నది తన అభిప్రాయమన్నారు. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. ఏపీలో మూడు రాజదానులు నిర్మించడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడ్డారు.

బీజేపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు. విద్యాలయాల్లో విద్యార్థుల వస్త్రధారణ మతాలకు అతీతంగా ఉండాలని, మతపరమైన వస్త్రధరణను తాను సమర్థించబోనని చెప్పారు. మీడియా సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బి.నాగేశ్వరరావు, ఏపీ అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)