amp pages | Sakshi

ఆర్బీకేల పనితీరు బాగుంది

Published on Wed, 06/07/2023 - 04:34

భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్‌ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛా­ంధ్ర మిషన్‌ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు.

ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్‌ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు.

సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్‌ శాఖల సహాయకులు జాబ్‌చార్ట్‌తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్‌ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభు­త్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువ­తులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది.  

కియోస్క్‌ పనితీరుపై ఆరా.. 
ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్‌ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్‌ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్‌ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు.

రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ పాము సునీతామాన్‌సింగ్‌ను కియోస్క్‌ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్‌ వివరించారు.

దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్‌ఆర్‌ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Videos

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)