amp pages | Sakshi

సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం

Published on Fri, 11/03/2023 - 04:05

సాక్షి, చిత్తూరు: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మై­నా­రిటీ అంటూ అణగారిన వర్గాలను అక్కున చేర్చు­కుని అన్నింటిలోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యా­యం సాధ్యమైందని మంత్రి చెల్లుబోయిన వేణుగో­పాల్‌ చెప్పారు. సామాజిక సాధికారత సాధించిన తరువాతే ప్రజల వద్దకు బస్సు యాత్ర ద్వారా వస్తు న్నా­మన్నారు. సామాజిక సాధికార బస్సు యా­త్ర­లో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగ­రంలో అశేష జనం మధ్య జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నాలు­గు­న్నరేళ్ల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు మేలు చేశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే  దక్కుతుందన్నారు.

1931 తర్వాత బీసీ కులగణన జరగలేదని, మళ్లీ ఇప్పుడే సీఎం జగన్‌ దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీసీ కుల­గణ­నకు పచ్చ జెండా ఊపారని కొనియాడారు. టీడీపీ పాలనలో సామాజిక న్యాయం ఎండమావిగా ఉండేదన్నారు. పైగా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను చంద్ర­బాబు సహా టీడీపీ నేతలు చులకన చేశారని గు­ర్తు­చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలనూ వైఎస్సార్‌సీపీ గెలవడం తథ్యమని చెప్పారు.

మైనారిటీలను మోసం చేసిన టీడీపీ:  అంజాద్‌ బాషా
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. టీడీ­పీ పాలనలో మైనారిటీలకు తీరని మోసం చేశారని విమర్శించారు. సీఎం జగన్‌ సామాజిక న్యాయాన్ని బాధ్యతగా భావించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని, ఇందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నా­రు. మైనారిటీ వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎంను చేశారని, ఇది చరిత్రలో నిలిచిపోయే విష­యమన్నారు.

ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు మైనారిటీలు గుర్తు­కొచ్చి, మొక్కుబడిగా ఓ మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. అందుకు భిన్నంగా సీఎం జగన్‌ మొదటి కేబినెట్‌­లోనే మైనారిటీ సామాజికవర్గానికి అవకాశం కల్పించారని తెలిపారు. మైనారిటీ మహిళను శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేశారన్నారు. టీడీపీ పాలన­లో మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ.2,665 కోట్లే ఖర్చు చేశారని, సీఎం జగన్‌ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.23,176 కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని చెప్పారు.

రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు మా­ట్లా­డుతూ..  బీసీ పార్టీగా డప్పు వాయించుకునే టీడీపీ బీసీలను  దగా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీసీలను వాడుకొని, తరువాత తీసి పడేసేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో బీసీలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితోపాటు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

బడుగుల అభివృద్ధికి సీఎం జగన్‌ నిరంతర కృషి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లా­డుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగనన్న నిరంతరం కృషి చేస్తున్నా­రన్నారు. రాజకీయ సమానత్వం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకు­లను రెచ్చిగొట్టి చంద్రబాబు విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వారిని కనీసం పరామర్శించలేదని చెప్పారు. పైగా, చిత్తూరు జిల్లా ఎస్పీ, పోలీసుల అంతు చూస్తామని నారా లోకేశ్‌ అనడం దుర్మార్గమన్నారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)