amp pages | Sakshi

ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీంకు

Published on Sun, 02/11/2024 - 04:39

సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించకుండా తెలంగాణ సహా­య నిరాకరణ చేస్తే సుప్రీంకోర్టుకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెల 17న కేంద్ర జల్‌ శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. కానీ, ఢి­ల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే తెలంగాణ అధి­కారులు మాటమార్చారు.

ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాల ఖరారుకు ఈనెల 1న హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులకు రెండు రా­ష్ట్రా­ల అధికారులు అంగీకరించినట్లు ప్రకటించినా, ఆ తర్వాత తెలంగాణ అధికారులు మరోసారి మాట­మార్చారు. ఈ నేపథ్యంలో గత నెల 17న తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు రా­ష్ట్రా­ల అధికారులతో సమావేశం నిర్వహించనున్నా­రు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తె­లంగాణ అధికారులు అంగీకరించకపోయినా లేదా గైర్హాజరైనా అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, కోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని 

కేం­­ద్రం నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. 
శ్రీశైలం ప్రాజెక్టుకు 2021లో ఎగువ నుంచి వరద రాకుండానే తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హ­క్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ న్యా­య పోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేసి, అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దాంతో కృ­ష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉ­మ్మ­డి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించా­లని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రా­ష్ట్ర భూభాగం పరిధిలోని ఆరు అవుట్‌లెట్లను బోర్డు­కు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైం­ది. తెలంగాణ సర్కారు మాత్రం తమ భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్లను  అప్పగించేందుకు నిరాకరించింది. 

యథేచ్ఛగా తెలంగాణ జలచౌర్యం
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్‌ 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్‌ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువ ద్వారా  విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు చేసిన వి/æ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు.

ఇదే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తెలంగాణ భూభాగంలో ఉందంటూ ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కారు అధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దాంతో నవంబర్‌ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు సాగర్‌ స్పిల్‌ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తాగు నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో డిసెంబర్‌ 1న రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ బల్లా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, సంయమనం పాటించాలని ఆదేశించారు. సాగర్‌పై నవంబర్‌ 30 నాటి యథాస్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖను ఆదేశించారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)