amp pages | Sakshi

శ్రీవారి దర్శనానికి 24 గంటలు 

Published on Mon, 09/12/2022 - 04:38

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్ నిండి క్యూ లైన్‌ రాంభగీచ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,741 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.22 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు 
బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1,189 మంది క్షురకులు 
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించనున్న భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా 1,189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేసింది.

వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండటంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.

ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. ప్రధాన కల్యాణకట్టతోపాటు, పీఏసీ–1, పీఏసీ–2, పీఏసీ–3, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద గల మినీ కల్యాణకట్టలు కూడా 24 గంటలు పని చేస్తున్నాయి.

జీఎన్‌సీ, నందకం విశ్రాంతి గృహం, హెచ్‌వీసీ, కౌస్తుభం, సప్తగిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో రెగ్యులర్‌ క్షురకులు 337 మంది, పీస్‌ రేటు క్షురకులు మరో 852 మంది 3 షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్‌ టోకెన్‌ అందజేస్తారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)