amp pages | Sakshi

బాబు నుంచి భూమిని ఇప్పించండి

Published on Tue, 02/08/2022 - 04:11

తాడేపల్లి రూరల్‌: తన ఇంటికి వెళ్లడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించాడు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డిని కలిశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్‌కు దారిలేకపోవడంతో ఆర్డీవో, తాడేపల్లి తహసీల్దార్‌లు.. శ్రీనివాసరావుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారు.

ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్‌ వేశారు.  అయితే ఈ స్థలానికి సంబంధించి బాధితుడికి రూపాయి కూడా చెల్లించలేదు. అప్పటి నుంచి అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ కాలం గడిపారు. ఇప్పుడు తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టామని శ్రీనివాసరావు వాపోతున్నాడు. వైద్యానికి నగదు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశామని కన్నీటిపర్యంతమయ్యాడు.

తన తండ్రి వైద్యానికి మరో రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని చెబుతున్నాడు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే మరోవైపు తమకు కమీషన్‌ ఇస్తే స్థలానికి డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ స్థలం అయినా తమకు అప్పగించాలని లేదా నగదు అయినా ఇవ్వాలని కోరాడు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని  శ్రీనివాసరావు పేర్కొన్నాడు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)